హమాలీల సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - Sep 25 , 2024 | 10:45 PM
సివిల్ సప్లైస్ హ మాలీల సమస్యలను పరిష్కరిం చాలని హమాలీ వర్కర్స్ యూని యన నాయకుడు మురళి డి మాండ్ చేశారు.
రైల్వేకోడూరు(రూరల్) సెప్టెంబరు 25: సివిల్ సప్లైస్ హ మాలీల సమస్యలను పరిష్కరిం చాలని హమాలీ వర్కర్స్ యూని యన నాయకుడు మురళి డి మాండ్ చేశారు. బుధవారం సి విల్ సప్లైస్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కళ్లకు నల్ల రిబ్బన కట్టు కుని ఆందోళన చేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లడుతూ కూలి రేట్లు పెంచి 9 నెలల కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమన్నారు. సివిల్ సప్లైస్ హమాలీల కూలి ధరలు పెంపు అమలు చేయడంతోపాటు, ఎరియర్స్‌తో కలిపి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, వెంకటయ్య, వాసు, గోపి, గణేష్, రమణ, బాబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట: రాజంపేట సివిల్ సప్లై కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎంఎస్‌రాయుడు, పట్టణ కార్యదర్శి సికిందర్, నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. హమాలీ సంఘ నాయకులు సూర్యరాఘవేంద్ర, ప్రసాద్, కోదండరాముడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 25 , 2024 | 10:45 PM