Teachers day: సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ABN, Publish Date - Sep 05 , 2024 | 11:38 PM
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణన జయంతి సందర్భంగా గురువారం స్థానిక బుగ్గకాలువలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో గురుపూజోత్సవం నిర్వహించారు.
గురుపూజోత్సవాల్లో ఎమ్మెల్యే షాజహాన బాషా
మదనపల్లె అర్బన, సెప్టెంబరు 5: సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణన జయంతి సందర్భంగా గురువారం స్థానిక బుగ్గకాలువలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో గురుపూజోత్సవం నిర్వహించారు. మదనపల్లె నియోజకవర్గం రామ సముద్రం, మదన పల్లె రూరల్, నిమ్మనపల్లె, మదనపల్లె పట్టణంలోని ఉత్తమ ఉపాధ్యా యులకు దుశ్శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పీఎం స్థాయికి ఎదగడంలో గురువు పాత్ర ఎంతో ఉంటుందన్నారు. గురువులు ఇచ్చిన సూచనలు, క్రమశిక్షణ, మార్గ దర్శకాలు భవిష్యతలో ముందుకు నడిపిస్తాయని తెలిపారు. అనం తరం ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంస పత్రాలతోపాటు మెమెంటో లు ఇచ్చి సత్క రించారు. కార్యక్రమంలో ఎంఈవోలు హేమలత, ప్రభాకర్‌రెడ్డి, రాజగోపాల్, పఠాన మహమ్మద్‌ఖాన, టీడీపీ నాయకులు షంషీర్, నాదేళ్ల శివన్న, రామకృష్ణ, ఆర్‌జే వెంకటేష్, స్వామి, శ్రీనివాసు లు, కౌన్సిలర్ నాగార్జునబాబు(గాంధీ), ఎస్టీయూ నాయకులు మధు, పురం వెంకటరమణ, యూటీఎఫ్ నాయకులు గాలి రవీంద్ర, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయలు పాల్గొన్నారు. ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గొల్లపల్లెలోని శ్రీరస్తు కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహానబాషా విశ్రాంత డీఈవో నరసింహులును సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షనర్స్‌కు సమావేశ మందిరం, మెడిటేషనకు హాలుకు కావాల్సిన స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చా రు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్య క్రమానికి మదనపల్లెకు చెందిన జ్ఞానోదయ కరస్పాండెంట్ ప్రసాద రావు భోజన వితరణ చేయగా, ఎస్‌ఎస్ జ్యువెలరీస్ పూలహారాలు, శాలువలు వితరణ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు మణికంటె నారాయణ, సహాధ్యక్షుడు సీఆర్ శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు ఎం.రెడ్డెప్ప, ప్రధానకార్యదర్శి గురు నారాయణాచారి, కోశాధికారి పీసీ తిమ్మయ్య, సభ్యులు జగనమోహన, కుమారస్వామి, మగ్బూల్‌బాషా, శివప్రసాద్, కృష్ణమూర్తి, మహిళా అధ్యక్షురాలు డి. శకుంతలమ్మ, శాంతమ్మ, కవి పోతబోలు రెడ్డెప్ప, పాల్గొన్నారు.
వాల్మీకిపురం: మండల కేంద్రంలోని పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా పాఠశాల హెచఎం సావిత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఆదర్శ ప్రాయుడు సర్వేపల్లె రాధాకృష్ణన అని ఆయన సేవలు విద్యారంగానికే తలమానికమన్నారు. దేశభవిష్యత్తును తీర్చి దిద్దే బాధ్యత ఉపాధ్యాయ వృత్తిపై ఉందన్నారు.
పెద్దమండ్యం: తహసీల్దార్ సయ్యద్ అహ్మద్ అన్నారు. పెద్దమండ్యం ప్రాథమిక పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఎంపీడీవో శ్రీధర్‌రావు, ఎంఈవోలు మనోహర్, రామకృష్ణ, ఉపాధ్యాయ సంఘ నాయకులు సురేంద్రరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కురబలకోట: మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కళాశాల చైర్మన ద్వారక నాథ్, ప్రిన్సిపాల్ యువరాజ్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, రంగాచార్యులు, శాంతమ్మ, వెంకటరమణ, మధుసూదన లను సన్మానించారు. ముదివేడు, కురబలకోట, అంగళ్ళు,తెట్టు పాఠ శాలల్లో ఎంఈవో ద్వారకనాథ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. మండల పరిధిలో 13మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు.
తంబళ్లపల్లె: మండలంలోని రేణుమాకులపల్లె ఉన్నత పాఠశాల కార్యక్రమంలో ఎంఈవో త్యాగరాజు కేకు కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో హెచఎంలు, ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ చైర్మన్లు, కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పీలేరు: ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు శ్రీధర్ స్వామి, మనోరంజని, హేమలత, సుధాకర్ రెడ్డిని పీలేరు ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. స్థానిక మెయిన స్కూలులో మానవత సంస్థ ఆధ్వర్యంలో 28 మంది రిటైర్డు ఉపాధ్యాయులను సన్మానించారు. పీలేరు ఉన్నత పాఠశాల హెచఎం నటరాజన రాయ చోటిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్ర మాల్లో ఎంపీడీవో ఉపేంద్ర రెడ్డి, ఎంఈవోలు లోకేశ్వర రెడ్డి, పద్మావతమ్మ, మానవత సంస్థ చైర్మన రామచంద్ర, అధ్యక్షుడు శెట్టిసుబ్రహ్మణ్యం, కార్యదర్శి బీవీ సురేశ, సభ్యులు పోతంశెట్టి రమేశ, రహత, తదితరులు పాల్గొన్నారు.
పెద్దతిప్పసముద్రం: పీటీఎం మోడల్ స్కూల్లో ప్రిన్సపాల్ శివకుమారి విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు. విజయగణపతి కళ్యాణ మండపంలో ఎంఈవో నారాయణ చేతుల మీదుగా ఉత్తమ ఉపాద్యాయులకు జ్ఞాపికలు అందజేశారు. ఎంపీడీవో కె.ఎన.బాలాజీ, ఈవోపీఆర్డీ యోగానంద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బి.కొత్తకోట: మోడల్‌స్కూల్‌లో ఎంఈవో రెడ్డిశేఖర్ మాట్లాడుతూ ఎవరు ఏ స్థాయిలో వున్నా తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు లను స్మరించుకోవాలన్నారు. ప్రిన్సిపాల్‌లు శ్రీనూనాయక్, వాసుదేవ రావు, కస్తూరిబా ఎస్వో విశ్వలత, ఉపాధ్యాయులు మునిరెడ్డి, ప్రవల్లిక, గాయిత్రి, ప్రత్యూష, హెచఎం ఖాజాపీర్. స్కూల్‌కమిటీ ఛేర్మన రూహీజాస్మిన తదితరులు పాల్గొన్నారు.
గుర్రంకొండ: మండలంలోని అన్ని పాఠశాలల్లో గురుపూజోత్సవం నిర్వహించారు.
కలకడ:మండలంలోని పాఠశాలల్లో గురు పూజోత్సవం నిర్వహించారు. కార్యక్రమాల్లో హెచఎం చెంగల్‌రాయులు, ప్రిన్సిపాల్ మలాంషా వలి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రామసముద్రం: మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఆర్ .బీబీ, చెంగలరాయాచారి, సరస్వతిదేవి, ఇ. నరసింహులు, ఎం.కేశవకుమార్, బి.జ్యోతి, పి.మనోహర్‌రాజు, వి. దివాకర్, జడ్పీ హైస్కూల్‌కు సంబంధించి ఎం.నాగరత్నమ్మ, ఎం. గాయత్రి, ఎస్.అఫ్రోజ్, వీఈ. శాంతకుమారి, ఎస్.బాలాజి, పద్మావత మ్మ, కె.ప్రభాకర్‌రావు, ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన జి.విజయలక్ష్మి, కస్తురిబా పాఠశాల ప్రిన్సిపాల్ మస్తానబీ మదనపల్లెలో జరిగిన గురుపూజోత్సవంలో ఎమ్మెల్యే షాజహానబాషా చేతుల మీదుగా ప్రశంసపత్రాలు అందుకున్నారు. రాజంపేట పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన గురరుపూజోత్సవాల్లో రామసముద్రం తూర్పు ప్రథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హేమలత జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు.
కలికిరి: మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వి. నీలకంఠయ్య జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం రాయచోటిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు చామకూరి శ్రీధర్, డీఈవో శివప్రకాష్ రెడ్డి శాలువా కప్పి సన్మానించారు. ఎంఈవోలు కరీముల్లా, నాగార్జున రెడ్డి, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Sep 05 , 2024 | 11:38 PM