ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పెన్షన్ల పాపం వైసీపీదే : నల్లారి

ABN, Publish Date - Apr 03 , 2024 | 10:53 PM

సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో జాప్యం కేవలం వైసీపీ నిర్లక్ష్యమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు.

వేపులబైలులో కిశోర్‌ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

పీలేరు, ఏప్రిల్‌ 3: సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో జాప్యం కేవలం వైసీపీ నిర్లక్ష్యమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. పీలేరు పట్టణంలోని కోటపల్లె, మండలంలోని వేపులబైలు పంచాయతీలో బుధవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూచించిన విధంగా పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గ్రామ సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టంగా నిర్దేశించినా ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిందన్నారు. తమకు కావాల్సిన వారికి కోట్లాది రూపాయల మేరకు బిల్లులు చెల్లించుకున్న ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన పింఛన్ల సొమ్మును మాత్రం సర్దుబాటు చేయలేకపోయిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ నాయకులు టీడీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. వలంటీర్ల తొలగింపు పాపం పూర్తిగా వైసీపీదేనన్నారు. పింఛన్ల పంపిణీకి తమ పార్టీ పూర్తిగా అనుకూలమని, రాష్ట్రంలో సామాజిక భద్రతా పింఛన్లను ప్రారంభించింది టీడీపీయేనన్నారు.

వైసీపీలో భారీగా చేరికలు

పీలేరు పట్టణానికి చెందిన పీలేరు ఏఎంసీ డైరెక్టర్‌, మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డి సమీప బంధువు జీవీ నరేశ్‌ రామ్‌కుమార్‌ రెడ్డి బుధవారం నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వేపులబైలు పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్‌ నారాయణ రెడ్డి, ఎన్‌.హరినాథరెడ్డి, నాగభూషణ్‌, నాగయ్య, తెల్లమేకల శ్రీనివాసులు, గాయం గుణశేఖర్‌ రెడ్డి, తదితరులు తమ కుటుంబాలతో సహా టీడీపీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి వారందరినీ కిశోర్‌ కుమార్‌ రెడ్డి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 10:53 PM

Advertising
Advertising