ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

100 days బాబు హయాంలో ప్రగతిపథంలో రాష్ట్రం

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:16 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 4వ సారి ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజుల్లోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగు తీస్తోందని నియోజకవర్గ టీడీపీ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నారు.

రాజంపేట: పేదలకు అన్నం వడ్డిస్తున్న సుగవాసి బాలసుబ్రమణ్యం

రాజంపేట, సెప్టెంబరు 20: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 4వ సారి ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజుల్లోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగు తీస్తోందని నియోజకవర్గ టీడీపీ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం స్థానిక అన్న కాంటీన వద్ద టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ప్రజలతో ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందంటూ నినదించారు. ఈ సందర్భంగా ఆయన అన్న క్యాంటీనలో పేదలకు భోజనాన్ని వడ్డించారు. అనంతరం మాట్లాడుతూ వృద్ధులకు, వితంతువులకు పింఛను పెంపు, మెగా డీఎస్సీ నోటిఫికేషన, పంచాయతీలకు నిధులు కేటాయింపు, ఉద్యోగుల కు ప్రతినెలా 1నే జీతాలు తదితర కార్యక్రమాలు కేవలం 100 రోజుల్లోనే నిర్వహించడం చంద్రబాబు నాయుడుకే దక్కుతుం దన్నారు. అనంతరం అన్న క్యాంటీనలో పేదలకు భోజనాన్ని వడ్డించా రు ఈ కార్యక్రమాల్లో టీడీపీ రాజంపేట పార్లమెంట్‌ లీగల్‌సెల్‌ అధ్య క్షుడు టి.లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లునాయుడు, దంతవైద్యుడు నవీన కుమార్‌, లక్ష్మీనరసయ్య, టైల్స్‌ నరసింహ, జనసేన నాయకులు అబ్బిగారి గోపాల్‌, అగ్రహారం నాయకులు సుధాకర్‌, మండల టీడీపీ నాయకుడు గన్నే సుబ్బనరసయ్య నాయుడు, రాజంపేట కార్య నిర్వా హక కార్యదర్శి నాగముని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజంపేటలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజంపేట పార్టమెంటు టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలే చంద్రబాబు పరిపాలన తీరు, ముందు చూపునకు నిదర్శనమన్నారు. విజయవాడలో వరద బాధితులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు పడ్డ కష్టం రాష్ట్ర ప్రజ లు మరచిపోలేదన్నారు. రాజంపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడు సుబ్ర మణ్యం నాయుడు, కల్లుగీత రాష్ట్ర కార్పొరేషన మాజీ డైరెక్టర్‌ కొమరా వెంకటనరసయ్య, పార్లమెంట్‌ కార్యదర్శి సుబ్రమణ్యం నాయుడుతో పాటు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం : డాక్టర్‌ లక్ష్మీప్రసాద్‌రెడ్డి

చిన్నమండెం: కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా మండలంలోని సచివాలయం-2లో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సోదరుడు డాక్టర్‌ మండిపల్లి లక్ష్మిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్య మంత్రి చేయని విధంగా చంద్రబాబు నాయుడు వంద రోజుల్లోనే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతు న్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల్లో సాధించిన విజయాలు, ప్రగతిని రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు ప్రజా దర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నామన్నారు. గతంలో ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డీఎస్సీ ద్వారా 16,437 టీచర్‌ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను నివారించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దివ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి గ్రామ సభలు

సంబేపల్లె: ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభలు నేటి నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సునీల్‌కుమార్‌ తెలిపారు. సంబేపల్లెలో 21వ తేదీ శనివారం గ్రామసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 23వ తేదీ రౌతుకుంట, నారాయణరెడ్డిపల్లె, మోటకట్ల గ్రామాల్లో 24న దేవపట్ల, నాగిరెడ్డిగారిపల్లె. 25న గుట్టపల్లి1, గుట్టపల్లి 2, గున్నికుంట్ల, 26వ తేదీ దుద్యాల, శెట్టిపల్లె, గున్నికుంట్లలో సభలు నిర్వహించనున్న ట్లు తెలియజేశారు. ఆయా గ్రామాలకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలు సచివాలయ సిబ్బంది హాజరవుతారని తెలిపారు. ఈ సభల్లో ప్రభుత్వం వంద రోజుల్లో అమ లు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై వివరించనున్నట్లు తెలిపారు.

Updated Date - Sep 21 , 2024 | 12:16 AM