రోడ్డున్నా.. బస్సులు తిరగవన్నా..!
ABN, Publish Date - Nov 18 , 2024 | 11:57 PM
పెద్దమం డ్యం మండలంలో అధికంగా గిరిజన తాండాలు నివ శిస్తున్న బండ్రేవు- గాలివీడు రహదారి ఆర్టీసీ బస్సు లు నడవడంలేదంటూ తాండావాసులు వాపోతు న్నారు.
బండ్రేవు - గాలివీడు మార్గంలో నడవని ఆర్టీసీ బస్సులు ఆందోళనలో గిరిజనగ్రామాల ప్రజలు
పెద్దమండ్యం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి) పెద్దమం డ్యం మండలంలో అధికంగా గిరిజన తాండాలు నివ శిస్తున్న బండ్రేవు- గాలివీడు రహదారి ఆర్టీసీ బస్సు లు నడవడంలేదంటూ తాండావాసులు వాపోతు న్నారు. రోడ్డు మార్గం బాగా ఉన్నప్పటికి బస్సులు రాకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి వేలాది రూపాయలు ఖర్చుచేయాల్సివస్తోందంటున్నా రు. మండలంలోని బండ్రేవు, అవికేనాయక్ తాండ, ధేనేనాయక్‌తాండ, తుమ్మలవంకతాండ, దేవ ళం తాండ, దిగువపల్లి గ్రామ ప్రజలతో పాటు గాలి వీడు మండల ప్రజలు అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లాలంటే పలు ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా పనుల నిమిత్తం పెద్దమండ్యం, మదనపల్లి, తంబళ్లపల్లికు వెళ్లాలంటే 6 కిలో మీటర్లు నడిచి వెళ్లి బండ్రేవుకు ఆటోలలో చేరుకోవాలని ఇందుకు రూ. 100 నుంచి రూ. 150 చెల్లించాల్సి వస్తోందని వాపో యారు. బండ్రేవు నుంచి నేరుగా మదనపల్లి వెళ్లడా నికి ఆర్టీసీ బస్సులు కానీ ఆటోలు లేవని వారు తెలి పారు. గతంలో బండ్రేవు- గాలివీడు మార్గంలో ఆర్టీసీ బసు నడపాలని గత నాయకులకు మొరపె ట్టుకున్న పట్టించుకోలేదన్నారు. ఈ మార్గంలో మదన పల్లి ఆర్టీసీ బసులు మదనపల్లి వయా తంబళ్లపల్లి, బండ్రేవు, గాలివీడు, పెద్దమండ్యంకు నడిపితే ప్రజ లకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఇప్పటికైన జిల్లా అధికారులు, కూటమి నేతలు చర్యలు తీసుకొని బండ్రేవు-గాలివీడు గిరిజన తాండా మార్గంలో ఆర్టీసీ బసులు నడపాలని ప్రజలు కోరుతున్నారు.
ఆర్టీసీ బస్సులు నడపండి
బండ్రేవు- గాలివీడు మార్గంలో ఆర్టీసీ బసులు నడపి గిరిజన వాసులకు దశాబ్దాలుగా ఉన్న సమస్యల పరిష్కరించండి. ఈ మార్గంలో ఆర్టీసీ బసులు నడి పితే ప్రజలకు కష్టాలు తీరుతాయి. తాండావాసుల పట్ల నిర్లక్ష్యం తగదు. ఆర్టీసీ అధికారులు స్పందిం చండి.
- వేమయ్య, మాజీ సర్పంచ,
బండ్రేవు గ్రామ పంచాయతీ, పెద్దమండ్యం
Updated Date - Nov 18 , 2024 | 11:58 PM