ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం: ఎమ్మెల్యే
ABN, Publish Date - Sep 23 , 2024 | 11:53 PM
రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, అందుకే తమ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు.
వల్లూరు, సెప్టెంబరు 23 : రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, అందుకే తమ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని అంబవరం గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల కోసం ఈ ప్రభుత్వం పలు రకాల కార్యక్రమాలు చేపడుతోందన్నారు. వల్లూరు, కమలాపురం మండలంలోని చెరువులకు నీరు నింపి సాగు నీటి కొరత లేకుం డా చూస్తామన్నారు. అంబవరం గ్రామ పంచాయతీలో రోడ్లు, డ్రైనేజీలకు రూ.40లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ‘మీకు ఏం కావాలో తెలపండి, సహకరిస్తాం’ అని ఎమ్మెల్యే ప్రజలకు భరోసా ఇచ్చారు. కొందరు రోడ్లు బాగాలేవని, రైల్వే గేటుతో ఇబ్బందులు పడుతున్నామని తెలుపగా ఆయా సమస్యలను తీరుస్తామన్నారు.
ఫ్లైవర్ నిర్మాణం కోసం సీఎంతో చర్చిస్తామన్నారు. అనంతరం అం బవరం అంగన్వాడీని పరిశీలించారు. అనంతరం పొలంబడి పోర్టల్‌ను విడుదల చేశారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భా గం గా టీజీపల్లె కమలాపురం జనసేన ఇనచార్జ్ వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి క్రిష్ణకిశోర్, తహసీల్దారు వెంకటలక్ష్మి, ఎంపీడీఓ జయశ్రీ, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ, పీఆర్ లతో పాటు మండల టీడీపీ అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి, నల్లపురెడ్డిపల్లె రామసుబ్బారెడ్డి, వై.శివారెడ్డి, క్రిష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మదనమోహనరెడ్డి, జయసుబ్బారెడ్డి, శివారెడ్డి, ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Sep 23 , 2024 | 11:53 PM