నేడు తొగటవీర క్షత్రియుల వనభోజనం
ABN, Publish Date - Nov 24 , 2024 | 12:04 AM
కనుమలోపల్లి 108 శివలింగాల మహా లింగేశ్వరస్వామి సన్నిధిలో ఆదివారం తొగటవీర క్షత్రియుల కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తొగట వీరక్షత్రియ సంక్షేమ సంఘం నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కళ్యాసుధాకర్, పల్లా నరసింహారావు తెలిపారు.
కడప ఎడ్యుకేషన, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కనుమలోపల్లి 108 శివలింగాల మహా లింగేశ్వరస్వామి సన్నిధిలో ఆదివారం తొగటవీర క్షత్రియుల కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తొగట వీరక్షత్రియ సంక్షేమ సంఘం నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కళ్యాసుధాకర్, పల్లా నరసింహారావు తెలిపారు. శనివారం ఆ సంఘం కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మా ట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కదిరి శాసనసభ్యుడు వెంకటప్రసాద్, రాష్ట్ర, జిల్లాల సంఘం నాయకులు పాల్గొంటారన్నారు. ముఖ్య అతిథుల సందేశం, పవిత్ర వనభోజన ప్రసాదం స్వీకరణ తరువాత నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తామన్నారు. అలాగే మహిళలు, పిల్లలకు ఆటల పోటీలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. కా వున కుటుంబ సమేతంగా హాజరై వనభోజనంలో పాల్గొని ఈశ్వర కటాక్షం పొందాలని ఆకాంక్షించారు. సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడిశెట్టి సుబ్రమ ణ్యం, కోశాధికారి సుదర్శన, ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లా మురళీక్రిష్ణయ్య, ఉపాధ్యక్షులు సూరిబాబు, వెంకటస్వామి, దొడ్ల వెంకటరమణ, వెంకటసుబ్బ య్య, సుబ్బరాయుడు పాల్గొన్నారు.
Updated Date - Nov 24 , 2024 | 12:04 AM