ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా వినాయక నిమజ్జనం

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:40 PM

మండలంలోని ము ష్టూరు పంచాయతి యర్ర ప్పగారిపల్లిలో వెలసిన వినాయక విగ్రహానికి ఆది వారం భక్తిశ్రద్ధలతో పూజ లు నిర్వహించి నిమజ్జనం చేశారు.

యర్రప్పగారిపల్లిలో గణేశ నిమజ్జనంలో పాల్గొన ్న టీడీపీ నాయకులు

నిమ్మనపల్లి, సెప్టెంబరు 15: మండలంలోని ము ష్టూరు పంచాయతి యర్ర ప్పగారిపల్లిలో వెలసిన వినాయక విగ్రహానికి ఆది వారం భక్తిశ్రద్ధలతో పూజ లు నిర్వహించి నిమజ్జనం చేశారు. ఈ సంధర్బంగా మదనపల్లి ఎమ్యెల్యే షాజ హానబాషా కుమారుడు జునైద్‌అక్బరీ, మండల టీడీపీ నాయకులు వినా యక స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. నిమజ్జనం సంధర్బంగా ఎలాం టి గొడవలు రాకుండా పోలీసు బందోబస్తు నిర్వహించినట్లు ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు.

కలకడలో:మండలంలోని కె.దొడ్డిపల్లె, బాటవారిపల్లె బీసీ కాలనీతోపాటు పలు గ్రామాల్లో ఆదివారం వినాయక నిమజ్జనాన్ని వైభవంగా జరుపుకు న్నారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తిని చాందినీ బండిపై మంగళవా యిద్యాలు, కోలాటాలు, బాణాసంచాల పేలుళ్ల నడుమ ఊరేగింపు నిర్వ హించారు. నిర్వాహకులు అన్నదానం, తీర్థప్రసాదాలను అందజేశారు.

వాల్మీకిపురంలో: వాల్మీకిపు రంలో ఆదివారం గణేశ విగ్రహాల నిమజ్జనం వైభ వంగా నిర్వహించారు. స్థాని క పింగాణిఫ్యాక్టరి, ఎనటీ ఆర్‌ కాలనీ, చాకలవీధి, తిరుచుట్టువీధి, జెట్టిపాళెం తదితర ప్రాంతాలలోని వినా యక విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణలు గావించి పురవీధులలో నగరోత్సవం అనంతరం విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్లాయి. స్థానిక సీఐ ప్రసాద్‌బాబు బందోబస్తు ఏర్పాటు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమాలలో గణేశ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

గణేశ లడ్డు రూ.లక్షా50వేలు

వాల్మీకిపురం మండలంలోని అయ్యవారిపల్లెలో గణేశ లడ్డుకు రికార్డు ధర పలికింది. గ్రామానికి చెందిన గంగసాని నరసింహారెడ్డి రూ.1,50,027 లకు గణేష్‌ లడ్డు సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు నరసిం హారెడ్డిని ఘనంగా సత్కరించి ప్రసాదాలు అందజేశారు.

రామసముద్రంలో: మండల కేంద్రంలో ఆదివారం జరిగిన గణేశ నిమజ్జనం సీఐ రమేష్‌ పర్యవేక్షణలో జరిగాయి. వినా యక చవితి ఉత్సవాలలో భాగంగా 9వ రోజు ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనో త్సవాలు సందడిగా సాగాయి. మండల కేంద్రంలోని ఎగువ దళితవాడ, చింతలవీధిలో ఆదివారం వైభవంగా వినాయకుని నిమజ్జనం జరిగింది. యువత సంతోషంగా రంగులు చల్లుకుని మహా గణపతి ఊరేగింపు చేశారు. అంబేడ్కర్‌ సర్కిల్‌ నందు బాణా సంచా పేల్చి బళ్లారి డ్రమ్స్‌లు వాయిస్తూ మహా గణపతి ఊరేగింపు చేశారు. వినాయకుని నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి సీఐ రమేష్‌, ఎస్‌బీహెడ్‌ కాననిస్టేబుల్‌ రంగస్వామి, పోలీస్‌ సిబ్బంది తగు చర్యలు చేపట్టారు.

మదనపల్లె అర్బనలో:మండలంలోని కొండామరిపల్లె పంచాయతీ ఇసుకనూతనపల్లె వినాయక నిమజ్జన కార్యక్రమంలో తాలుకా సీఐ కళా వెంకటరమణ పాల్గొన్నారు. అక్కడ నిమజ్జన సమయంలో వినాయకుడికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఎలాంటి సంఘటనలు జరగ కుండా చర్యలు చేపట్టారు. వినాయక విగ్రహాల నిమజ్జనంలో గ్రామాల్లో, వీధుల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి నిర్వహకులు డీజేలు పెట్టరా దని, అతిక్రమించి పెట్టితే వాహనం సీజ్‌చేసి డ్రైవర్‌పై కేసును నమోదు చేస్తామని తాలుకా సీఐ కళా వెంకటరమన తెలిపారు. నిమజ్జనం సమ యంలో మద్యం తాగి ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై బైండోవర్‌ కేసులను నమోదు చేసి చట్టపర మైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జయరాం యాదవ్‌, వెంకటరమణ, రాటకొండ మధుబాబు, పెద్ద సంక్యలో యువత, ప్రజలు, పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:40 PM

Advertising
Advertising