ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుడికాల్వ పరిధిలోని చెరువులన్నీ నింపుతాం: బీటెక్‌ రవి

ABN, Publish Date - Nov 02 , 2024 | 11:26 PM

లింగాల కుడికాల్వ పరిధిలోని చెరువులన్నీ నింపుతామని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి బీటెక్‌ రవి అన్నారు.

లింగాల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): లింగాల కుడికాల్వ పరిధిలోని చెరువులన్నీ నింపుతామని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి బీటెక్‌ రవి అన్నారు. లింగాల పాత చెరువుకు పెంచికల బసిరెడ్డి రిజర్వాయర్‌ (సీబీఆర్‌) కుడికాల్వ నుంచి ఎత్తిపోతల ద్వారా శనివారం ఆయన నీటిని విడుదల చేశారు. వేసవిలో తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని చెరువులకు నీటిని విడుదల చేస్తామన్నారు. అనంరం దీపం-2 పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేశారు. గ్యాస్‌ కు సంబంధించి ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో టీడీపీనాయకులు జోగిరెడ్డి, సంజీవరెడ్డి, విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.

గుంతలు లేని రోడ్లుగా చేయడమే ధ్యేయం

సింహాద్రిపురం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి) గుంతలు లేని రోడ్లుగా చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్‌ రవి) పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గుంతలు రహిత ఆంధ్రప్రదేశ ముందడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని నిడివెలగల-హిమకుంట్ల ఆర్‌అండ్‌బీ రోడ్డు ప్యాచ పనులకు బీటెక్‌ రవి భూమిపూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభిచారు. ఈ సందర్భంగా బీటెక్‌ రవి మా ట్లాడుతూ గత జగన ప్రభుత్వంలో రోడ్ల మరమ్మతులు చేసి నట్లు ఆనవాళ్లు కూడా లేవన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ మండల ఇంచార్జ్‌ జోగిరెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 11:27 PM