రాబోయే సీజన్‌కు కృష్ణా జలాలు అందిస్తాం
ABN, Publish Date - Sep 23 , 2024 | 11:35 PM
రాబోయే సీజన్‌కు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స కాలువ ద్వారా నిరంతరం కృష్ణా జలాలను అందిస్తామని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
చిప్పిలి సమ్మర్ స్టోరేజి పూర్తి చేసి మదనపల్లె దాహార్తి తీరుస్తాం
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు
మదనపల్లె టౌన్, సెప్టెంబరు 23: రాబోయే సీజన్‌కు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స కాలువ ద్వారా నిరంతరం కృష్ణా జలాలను అందిస్తామని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టు కాలువల పరిశీలనలో భాగంగా ఆదివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన మంత్రి సోమవారం తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ సందర్భంగా తొలుత హార్సిలీహిల్స్ నుంచి కురబలకోట మండలం దొమ్మన్నబావి వద్ద పుంగనూరు బ్రాంచి కెనాల్‌ను పరిశీలించిన మంత్రి మదనపల్లె మండలం చిప్పిలి సమ్మర్‌స్టోరేజి ట్యాంకు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఐదేళ్లుగా నిలిచిపోయిన ఎస్‌ఎస్ ట్యాంకు మొరవ పనులపై పరిశీలించారు. దీనిపై హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఈ కాలువ గట్టుపైనే ఒక రాత్రి బస చేసి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయించి 90 శాతం హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రాజెక్టు పనులు పూర్తి చేయించారన్నారు. కానీ వైసీపీ ఐదేళ్ల పాలనలో హంద్రీనీవా ప్రాజెక్టుకు కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. సమ్మర్‌స్టోరేజి ట్యాంకులో ఉన్న ఇసుకను వైసీపీ నాయకులు ఐదేళ్ల పాటు దోచుకుతిన్నారని, దీని వలన ఎస్‌ఎస్ ట్యాంకులో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయన్నారు. ఈ గోతుల వలన వర్షపు నీరు సీపేజి అయి కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. దొమ్మన్నబావి వద్ద పలు ప్రాంతాల్లో హంద్రీనీవా కాలువ లీకేజిలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో సిమెంట్ లైనింగ్ పనులు చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. అక్టోబరులో చిప్పిలి సమ్మర్‌స్టోరేజి ట్యాంకు మొరవ పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. వచ్చే వేసవికి మదనపల్లె పట్టణ ప్రజలకు నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. హంద్రీనీవా పూర్తి చేసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్, హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స ఎస్‌ఈ సీఆర్ రాజగోపాల్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Sep 23 , 2024 | 11:35 PM