గ్యాస్ కష్టాలు తీరేదెప్పుడో..?
ABN, Publish Date - Sep 16 , 2024 | 11:47 PM
పెద్దతిప్పసముద్రం మండలంలో ఇండేన గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు.
ఇక్కట్లు పడుతున్న పీటీఎం వినియోగదారులు గ్యాస్ కావాలంటే తప్పని ఎదురుచూపులు
పెద్దతిప్పసముద్రం సెప్టెంబర్ 16 : పెద్దతిప్పసముద్రం మండలంలో ఇండేన గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. గ్యాస్ కావాలంటే వారం, పదిరోజులు ఎదురు చూడాల్సిన దుస్థి తి నెలకొంది. అసలు సిలిండర్‌లు ఎప్పుడు వస్తాయో? ధర ఎంత చెల్లించాలో? అనే విషయంపై గ్యాస్ ఎజెన్సీ నిర్వహణ దారుల తీరుప ట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ కావాలంటే కనీసం వారం పదిరోజులైనా ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెల కొందని వినియోగదారులు వాపోతున్నారు. గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ ఎప్పుడు వస్తుందో సమాచారం చెప్పేవారే కరువయ్యారని వినియోగదారులు మండిపడుతున్నారు. పెద్దతిప్పసముద్రం మండ లంలో ఇండేన గ్యాస్ ఎజెన్సీ మాత్రమే ఉండడంతో వారు ఎలా చేసి నా, ఏమి చెప్పినా చెల్లుబాటవుతోందని వినియోగదారులంటున్నారు.
గ్యాస్ సిలిండర్ కోసం తప్పని ఎదురుచూపులు
పెద్దతిప్పసముద్రం మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇంట్టో గ్యాస్ అయిపోగానే ఏ ద్విచక్రవాహనంలోనో, ఏ షేర్ ఆటోలో నో ఖాళీ సిలిండర్ ను ఉంచుకుని గ్యాస్‌బుక్‌ను తీసుకుని 20, 25 కిలోమీటర్లు పయనించి మండలకేంద్రంలో ఉన్న గ్యాస్ ఏజెన్సీ వద్దకు రావాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. తీరా ఏజెన్సీ దగ్గరకు ఇంత అగచాట్లు పడి వచ్చినా గ్యాస్ గోడౌన గేటుకు ఎప్పు డు చూసినా నోస్టాక్ బోర్డు దర్శనం ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. గ్యాస్ సిలిండర్ కోసం ఆనలైనలో ధరఖాస్తు చేసుకున్నప్పటికి కనీసం వారం పదిరోజులైనా వేచి చూడాల్సిన దుస్థితి మండలంలో నెలకొందని గ్యాస్ వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ కష్టాలు ఎప్పుడు తీరేనో..?
పీటీఎం మండలంలో వంట గ్యాస్ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ ఎజెన్సీ నిర్వాహకులు సరై నా సమయంలో గ్యాస్‌కు డీడీలు చెల్లించక పోవడంతో స్టాక్ రాక తీరని జాప్యం జరుగుతోందని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో మొత్తం 19,116 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో 12,214 దీపం కనెక్షన్లు కాగా వాటిలో 6406 జనరల్ కనెక్షన్లు ఉన్నాయి. 87 అంగనవాడీ కేంద్రాలకు సంబందించి 352 సీఎస్ ఆర్ కనెక్షన్లు ఉండగా స్థానిక పీటీఎంలో వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. అయితే వాణిజ్య కనెక్షన్లు పొందినవారు బ్లాక్‌లో పొందిన సిలిండర్లతోనే పని కానిచేస్తున్నారు. దీంతో సాదరణ వినియోగదారులు సకాలంలో సిలిండర్లు అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. కాగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తమ సొంత వాహనంలో గ్యాస్ తరలించి అదనంగా వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రానికి వచ్చి గ్యాస్ వినియోగదారులు గ్యాస్ తీసుకుంటే రూ. 839 లు తీసు కోవాల్సి ఉండగా అదనంగా రూ 11 వసూలు చేస్తున్నారు. గ్రామా ల్లోకి తమ వాహనం ద్వారా సరఫరా చేస్తే రూ 50 నుంచి రూ 100 వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
15 కి.మీ. పరిధిలో ఎలాంటి రుసుం చేయవద్దు
కొత్తగా వచ్చిన జీవో ప్రకారం మండలానికి 15 కిలోమీటర్ల పరిధిలో గ్యాస్ వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయ రాదు. గ్యాస్ వినియోగదారులకు ఖచ్చితంగా రసీదు ఇవ్వాల్సిందే. ఇం దుకు విరుద్ధంగా వసూలు చేస్తున్నట్లు మా దృస్టికి తెస్తే తగిన చర్యలు తీసుకుంటాం. గ్యాస్ వినియోగదారులు ప్రతి ఒక్కరు ఆన లైనలో బుక్ చేసుకుంటే డోర్ డెలవరీ ఇవ్వాలి. వినియోగదారులకు గ్యాస్‌పై ఏజెన్సీ నిర్వాహకులు సమగ్ర సమాచారంతోపాటు సిలిండర్ ను తప్పకుండా డోర్ డెలివరి చేయాలి. వినియోగదారులకు ఇబ్బం దులు పెడితే అలాంటి ఫిర్యాదులు వస్తే గ్యాస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఏజెన్సీ లెసెన్సను రద్దు చేస్తాం.
-వెంకటరెడ్డి, సివిల్‌సఫ్లైస్ డీటీ, పీటీఎం
వారం పదిరోజుల నుంచి తిరుగుతున్నా
గ్యాస్ సిలిండర్ కోసం వారం పదిరోజుల నుంచి తిరుగుతున్నా గోడౌన ఎప్పుడు చూసినా గేటుకు నోస్టాక్ బోర్డు పెట్టి ఉంటుంది. నేను వ్యవసాయ పనులను చేస్తాను. గ్యాస్ సిలిండర్ కోసం కూలి పనులను వదులుకుని వెళ్లాల్సి వస్తోంది
- షేక్ మస్తాన వ్యవసాయ కూలీ విసనకర్రవాండ్లపల్లె
గ్యాస్ ఎప్పుడొస్తుందో చెప్పేవారే లేరు.
గ్యాస్ కోసం పదిరోజుల నుంచి పీటీఎంకు తిరుగుతున్నా. కనీసం అక్కడ గ్యాస్ ఎప్పు డొస్తుందో చెప్పేవారే లేరు. నేనే కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగించుకుంటు న్నాం. గ్యాస్ కోసం రోజు మం డల కేంద్రానికి 10 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది గ్యాస్ నిర్వా హకులు సకాలంలో గ్యాస్ తెస్తే కూలీలకు ఉపయోగ కరంగా ఉంటుంది.
- పుంగనూరు ఆంజనేయులు, వ్యవసాయ కూలీ
Updated Date - Sep 16 , 2024 | 11:47 PM