ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రహదారికి మోక్షమెప్పుడో..?

ABN, Publish Date - Dec 06 , 2024 | 12:04 AM

తంబళ్లప ల్లె మండల కేంద్రం నుంచి కోసువారిపల్లె రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగుతుందంటూ ప్రజలు ప్రశ్ని స్తున్నారు.

గుంతలమయంగా మారిన తంబళ్లపల్లె-కోసువారిపల్లెకు వెళ్లే రోడ్డు

అధ్వానంగా తంబళ్లపల్లె-కోసువారిపల్లె రోడ్డు

అవస్థలు పడుతున్న 15 గ్రామాల ప్రజలు

అధికారులు స్పందించాలంటున్న జనం

టెండర్‌ ప్రక్రియ పూర్తికాగానే పనులు

చేపడుతామంటున్న పీఏయూ ఏఏఈ

తంబళ్లపల్లె, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): తంబళ్లప ల్లె మండల కేంద్రం నుంచి కోసువారిపల్లె రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగుతుందంటూ ప్రజలు ప్రశ్ని స్తున్నారు. ఈ రహదారి గుంతలమయంగా మార డంతో 15 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తంబళ్లపల్లె నుంచి కోసువారిప ల్లెకు వెళ్లే ప్రధాన రోడ్డు సుమారు 12 కిలో మీటర్ల మేర అధ్వానంగా మారింది. రోడ్డు ఆధ్యంతం పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహన చోదకుల సహనా న్ని పరీక్షిస్తోంది. ఈ రోడ్డుపై ప్రయాణం సాగిస్తే ఒళ్లు హునమవ్వడమే కాదు..వాహనాలు కూడా మరమ్మతులకు గురవుతాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఎంత జాగ్రత్తగా బండి నడిపినా గోతుల్లో పడి ప్రమాదాలు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తంబళ్లపల్లె మండల కేంద్రం నుంచి దాదంవడ్డిపల్లె, గుండూరివారిపల్లె, రామా పురం, జొన్నచేనుపల్లె, దిగువముట్రవారిపల్లె, పా పనచెరువుపల్లె, ముట్రవారిపల్లె కోసువారిపల్లె తదితర సుమారు 15 గ్రామాలకు పైగా వెళ్లడా నికి ఇదే ప్రధాన రోడ్డు. ఈ రోడ్డు మార్గాన పల్లెలు ఎక్కువగా ఉండటంతో నిత్యం వందల మంది ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు తదితర వాహ నాల్లో తంబళ్లపల్లెకు రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్కువగా రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చి వెళుతుంటారు. అంతేకాకుండా శనివారం, ఇతర ప్రత్యేకమైన పండుగ రోజుల్లో కోసువారిపల్లెలో కొలువైన వేంకటరమణ స్వామిని దర్శించుకోవడానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు వందల సంఖ్య లో ఈ రోడ్డు మార్గాన వచ్చి వెళ్తుంటారు. అయి తే ఈ రోడ్డుకంకర తేలిపోయి గుంతలమయమ వడంతో ప్రయాణం సాగించాలంటే అవస్థలు పడుతున్న ట్లు వాహన చోదకులు వాపోతున్నా రు. రాత్రి వేళల్లో అయితే గుంతలు కనిపించక వాహనాలు అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతున్నట్లు చెబుతున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఈ రోడ్డు తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు మరింత అధ్వానంగా తయా రైంది. దీంతో కోసువారిపల్లెకు వెళ్లే వారు కొంచెం దూరాభారమైన మదనపల్లె రోడ్డుకు ఉన్న మూలపల్లె, పంచాలమర్రి మీదుగా ఉన్న లింకు రోడ్డు మీదుగా దేవరబురుజుకు చేరుకుని అక్కడి నుంచి కోసువారిపల్లె ఇతర గ్రామాలకు వెళ్తు న్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రోడ్ల కు మహర్దశ పట్టింది. తంబళ్లపల్లె మండల కేం ద్రం నుంచి ముదివేడు క్రాస్‌ వరకు గోతుల మయంగా ఉన్న రోడ్డుకు చేపట్టిన మరమ్మతు పనులు దాదాపు పూర్తయ్యాయి. గతంలో చాలా అధ్వానంగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్ట డంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నా రు. అదేవిధంగా తంబళ్లపల్లె నుంచి కోసువా రిపల్లెకు వెళ్లే రోడ్డుకు కూడా మోక్షం కలిగిం చాలని ప్రజలు కోరుతున్నారు.

రోడ్డు టెండర్‌ ప్రక్రియలో ఉంది

తంబళ్లపల్లె నుంచి కోసువారిపల్లెకు వెళ్లే రోడ్డు (ముద్దలదొడ్డి రోడ్డు) వరకు 8కిలోమీటర్ల మేర రూ.7.65 కోట్ల నిధులతో మంజూరైంది. అయితే రోడ్డు టెండర్‌ ప్రక్రియలో ఉంది. టెండర్లు పూర్తి అయిన వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారం భిస్తాం.

-నిరంజనకుమార్‌రెడ్డి, పీఏయూ ఏఏఈ, తంబళ్లపల్లె

Updated Date - Dec 06 , 2024 | 12:04 AM