ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆలయ చైర్మన ఎవరికో..?

ABN, Publish Date - Oct 19 , 2024 | 11:13 PM

సంతానలక్ష్మి గా పేరుగాంచిన రెడ్డెమ్మకొండ ఆలయం చైర్మన పద వి ఎవరిని వరిస్తుందో ఇంకా అర్థంకాని పరిస్థితి. ఆలయ చైర్మన పదవి ఖాళీగా ఉండడంతో ఆలయం లో అభివృద్ది పనులు కుంటుపడుతున్నాయి.

రెడ్డెమ్మకొండ ఆలయం

రెడ్డెమ్మకొండ ఆలయ చైర్మన పదవి కోసం వర్గపోరు నెలలు గడుస్తున్న పట్టించుకోని నాయకులు కుంటుపడుతున్న ఆలయ అభివృద్ధి

గుర్రంకొండ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): సంతానలక్ష్మి గా పేరుగాంచిన రెడ్డెమ్మకొండ ఆలయం చైర్మన పద వి ఎవరిని వరిస్తుందో ఇంకా అర్థంకాని పరిస్థితి. ఆలయ చైర్మన పదవి ఖాళీగా ఉండడంతో ఆలయం లో అభివృద్ది పనులు కుంటుపడుతున్నాయి. రెడ్డెమ్మ కొండ ఆలయం అభివృద్ధి పథంలో నడవ నుంది. అమ్మవారి ఆలయాన్ని రూ.1.40 కోట్లతో అత్యంత వైభవంగా రాతితో పునర్నిర్మించారు. అలాగే కోనేరు ను రూ.25 లక్షలతో ఆధునీకీకరించారు. అభివృద్ధి పనులు పూర్తికావడంతో ఆలయం ప్రారంభోత్స వాని కి సిద్ధమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో గత పాలక వర్గం పూర్తిగా రద్దుఅయిం ది. దీంతో రెడ్డెమ్మకొండ దేవస్థానం చైర్మన కోసం ఎదురుచూస్తోంది. గుర్రంకొండ మండలం చెర్లోపల్లె రెడ్డెమ్మ అమ్మవారు అనగానే గుర్తొచ్చేది సంతాలక్ష్మి అమ్మవారు. ఈ ఆలయానికి సంతానం లేని వారు వచ్చి అమ్మవారి వద్ద వరపడితే సంతానం కలుగు తుందని భక్తుల నమ్మకం. దీంతో సంతానం కోసం ప్రతి ఆదివారం అమ్మవారి ఆలయానికి వేలాది మం ది దంపతులు వచ్చి దర్శించుకుంటారు. భక్తుల రాక తో ఆలయానికి ఆదాయం కూడా బాగానే ఉం టుం ది. ఇలాంటి ఆలయానికి చైర్మన లేకపోవడంతో అభివృద్ధి అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదని పలువురు వాపోతున్నారు. కాగా చైర్మన పదవి కోసం టీడీపీలో వర్గ పోటీ జరుగుతోంది. చైర్మన పద విని ఏ వర్గానికి కేటాయించాలో తెలియక నాయ కులు సతమతమవుతున్నారు.

ఓ వర్గానికి ఇస్తే...మరో వర్గం దూరం..?

గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ టీడీపీ కంచుకోట. ఇక్కడ ప్రతి ఎన్నికల్లో టీడీపీకే బలమైన మెజారిటీ వస్తుంది. ఈ నేపథ్యంలో దశాబ్దకాలంగా టీడీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఈ రెండు వర్గా ల్లోని ముఖ్య నాయకులు తమ వర్గానికి చెందిన వారి కే చైర్మన పదవి కావాలంటూ అదిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ అధిష్టానం మాత్రం రెండు వర్గాలు కలిసి చైర్మన పదవికి ఓ పేరును ప్రతి పాదించాలని సూచించింది. ఈ క్రమంలో నాయకు లు కలవలేక తమ ప్రయత్నాలు తాము చేస్తూ పం తం నేగ్గించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వర్గానికి పదవి ఇస్తే మరో వర్గం ఎక్కడ దూరమవు తుందోనని నాయకులు సంకటపడతున్నారు.

చైర్మన పదవికి నోటిఫికేషన ఇవ్వాల్సి ఉంది

రెడ్డెమ్మ తల్లి దేవస్థానం చైర్మన పదవి కోసం దేవ దాయశాఖ నుంచి నోటిఫికేషన రావాల్సిఉంది. ప్రభు త్వం మారడంతో పాత బోర్డు రద్దు అయింది. దేవదా యశాఖ నుంచి చైర్మన పదవికి నోటిఫికేషన రాగానే కొత్త బోర్డు ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించి చైర్మ నను నియమిస్తాం. కార్తీకమాసంలో అమ్మవారి ఆల యాన్ని ప్రారంభించాలని దేవదాయశాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.

-మంజుల, ఈవో, రెడ్డెమ్మ తల్లి ఆలయం, గుర్రంకొండ మండలం

Updated Date - Oct 19 , 2024 | 11:13 PM