ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజయదుర్గ సన్నిధిలో రాహుకాల పూజలు

ABN, Publish Date - Nov 12 , 2024 | 11:56 PM

కడప నగరం బిల్టప్‌ సర్కిల్‌ సమీపంలోని విజయదుర్గాదేవి సన్నిధిలో మంగళవారం రాహుకాల పూజలు ఘనంగా నిర్వహించారు.

విజయదుర్గ ఆలయంలో రాహుకాల పూజలు నిర్వహిస్తున్న భక్తులు

కడప కల్చరల్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కడప నగరం బిల్టప్‌ సర్కిల్‌ సమీపంలోని విజయదుర్గాదేవి సన్నిధిలో మంగళవారం రాహుకాల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజలకు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు హాజరై నిమ్మకాయలతో కూడిన రాహుకాల పూజలు చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాహుకాల పూజలు నిర్వహించారు. ఈనెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 5 గంటలకు అమ్మవారికి విశేష అభిషేకం, 10 గంటలకు ఆలయ యాగ మండపంలో చండీహోమం నిర్వహించనున్నారు. తదుపరి సహస్ర లింగార్చన, సుమంగళిపూజ, రాత్రి 7 గంటలకు 108 మంది ముత్తైదువలచే 108 దీపాలతో అష్టోత్తర దీపాలంకార చేయనున్నారు. కావున భక్తులు ఆ తల్లిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని ఆలయ వ్యవస్థాపకుడు మల్లికార్జునరావు, ఆలయ నిర్వాహకుడు దుర్గా ప్రసాద్‌ కోరారు.

Updated Date - Nov 12 , 2024 | 11:56 PM