ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓటమి భయంతోనే వైసీపీ దాడులు

ABN, Publish Date - May 10 , 2024 | 12:08 AM

ఓటమి భయంతోనే వైసీపీ శ్రేణు లు అనవసరంగా తమ వాళ్ళపై దాడులకు తెగబడుతు న్నారని టీడీపీ, జనసేన. బీజేపీ కూటమి తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నా రు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కూటమి అభ్యర్థి దాసరిపల్లె జయచంద్రారెడ్డి

ములకలచెరువు, మే 9:ఓటమి భయంతోనే వైసీపీ శ్రేణు లు అనవసరంగా తమ వాళ్ళపై దాడులకు తెగబడుతు న్నారని టీడీపీ, జనసేన. బీజేపీ కూటమి తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నా రు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ శ్రేణులు ఓటమి తప్పదని భావించి ఓటర్లను భయ భ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్ని స్తున్నారన్నారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురికావా ల్సిన అవస రం లేదని వచ్చేది కూటమి ప్రభుత్వమేనన్నారు. ప్రశాంత తంబళ్లపల్లె తన లక్ష్మమని తాను రాజకీయాల్లోకి వచ్చిన ప్పుడే చెప్పానన్నారు. అసాంఘిక శక్తులు చేస్తున్న అరాచకా లు ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ములకలచె రువు మండలం కుటాగులోళ్ళపల్లెలో తాగునీరు అడిగినందు కు ఎమ్మెల్యే భార్య ముందే నిండు గర్భిణిపై కాలుతో తన్ని దాడి చేసి రాక్షసులు, అంబోతులు మాదిరిగా వ్యవహరించార న్నా రు. పెద్దమండ్యం మండలంలో కూడా టీడీపీ కార్యకర్తపై దాడి చేశారన్నారు. పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా వ్యవ హరిస్తూ వైసీపీ నీడలో పనిచేస్తున్నారని జయచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. కుటాగుళ్ళపల్లె, పెద్దమండ్యం ఘటనలపై స్టేష న బెయిల్‌ కేసులు పెట్టి ఇళ్లకు పంపి ఈ ఆంబోతులను ఊర్లపైకి పంపుతున్నది పోలీసు వ్యవస్ధేనన్నారు. పోలీసులపై నమ్మకం లేక కేంద్ర ఎన్నికల కమిషన దృష్టికి తీసుకెళ్లి నియోజకవర్గంలో వంద శాతం వెబ్‌ కాస్టింగ్‌ నడుమ పోలీం గ్‌ జరుగుతుందన్నారు. దీన్ని జీర్ణించుకోలేక ప్రజలు ఓట్టేస్తే ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పడంతో ఓటమి భయంతో ఎమ్మెల్యే ఆగడాలను చేయిస్తున్నారన్నారు. పొరపాటున ప్రజలు ఫ్యానుకు ఓటేస్తే అదే ఫ్యానుకు మిమ్మి ల్ని వారు ఉరి వేస్తారన్నారు. ప్రజలందరూ ఆలోచించి ఓటేసి తంబళ్లపల్లెలో జరుగుతున్న అరాచకాలు, దౌర్జన్యాలను తరిమికొట్టాలని జయచంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ ప్రచార సమన్వయకర్త సీడు మల్లి కార్జుననాయుడు, పార్టీ పరిశీలకుడు నాగరాజు, జనసేన నియోజకవర్గ ఇనచార్జి పోతుల సాయినాధ్‌, టీడీపీ మండల అధ్యక్షులు పాలగిరి సిద్ధా, బిల్డర్‌ రమణ, నారాయణస్వామి రెడ్డి, ఆనందరెడ్డి, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్రయా దవ్‌, టీడీపీ నేతలు కట్టా దొరస్వామినాయుడు, గుత్తికొండ త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2024 | 12:08 AM

Advertising
Advertising