ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీకి ఏపీలో భవిష్యత్తు లేదు

ABN, Publish Date - Sep 12 , 2024 | 11:43 PM

వైసీపీకి ఏపీలో ఇక భవిష్యత్తు లేదని జగన్‌ ఒక రాజకీయ అజ్ఞానిగా విమర్శలు ఉన్నాయని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి విమర్శిం చారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విపత్కర పరిస్థితులను ఎదుర్కొని సహాయ కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షిస్తుంటే జగన్‌ బురదరాజకీయాలు చేయడం హేయమైన చర్య అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

జగన్‌ రాజకీయ అజ్ఞాని : వరద

ప్రొద్దుటూరు , సెప్టెంబరు 12 : వైసీపీకి ఏపీలో ఇక భవిష్యత్తు లేదని జగన్‌ ఒక రాజకీయ అజ్ఞానిగా విమర్శలు ఉన్నాయని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి విమర్శిం చారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విపత్కర పరిస్థితులను ఎదుర్కొని సహాయ కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షిస్తుంటే జగన్‌ బురదరాజకీయాలు చేయడం హేయమైన చర్య అన్నారు. ఇంతకాలం పరదాల మాటున దాక్కొని వున్న జగన్‌ చంద్రబాబు దెబ్బతో జనంలోకి ఒక్కరోజైనా రాగలిగాడన్నారు. వేల కోట్ల రూపాయలకు పడగలుఎత్తిన జగన్‌, ఆయన పార్టీ నాయకులు విజయవాడ బాధితుల కోసం ఒక్కరూపాయ సహాయం అందజేయలేదన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల అధికారులు అక్కడ పునరావస చర్యలు చేపడతావుంటే జగన్‌ నీచరాజకీయాలు చేయడం దౌర్భాగ్యమన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఈవి సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి బెజవాడ వరదలగురించి ప్రభుత్వంపై చేసిన విమర్శలు అర్థరహితమైనవన్నారు. మాజీ మున్సిపల్‌ చైర్మెన్‌ వీఎస్‌ ముక్తియార్‌ మాట్లాడుతూ జగన్‌, రాచమల్లు లాంటి వారు ప్రజలను ఎలా ఆదుకోవాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు మాజీ కౌన్సిలర్‌ బాబయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 11:43 PM

Advertising
Advertising