ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాటి కలిమి గుళ్లే.. నేటి కొలిమిగుండ్ల ..

ABN, Publish Date - Nov 08 , 2024 | 11:57 PM

కొలిమిగుండ్ల మండల కేంద్రానికి వాయవ్య దిశలో వెలసిన కలిమి గుళ్లు (మూడు గుళ్లు) 9వ శతాబ్దంలోని పల్లవరాజుల పాలనకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

మూడు గుళ్లుగా కనిపిస్తున్న కలిమిగుళ్లు

పల్లవరాజుల పాలనకు సజీవ సాక్ష్యం

రాష్ట్ర వ్యాప్తంగా మూడు చోట్ల ఈ నిర్మాణాలు ..

ఎటుచూసినా మూడుగుళ్లుగా కనిపించే అద్భుత కట్టడం

కొలిమిగుండ్ల, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): కొలిమిగుండ్ల మండల కేంద్రానికి వాయవ్య దిశలో వెలసిన కలిమి గుళ్లు (మూడు గుళ్లు) 9వ శతాబ్దంలోని పల్లవరాజుల పాలనకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కలిమి అనగా సంపద. పల్లవరాజుల కాలంలో సంపదను దాచడానికి ఈ గుళ్లు ఏర్పాటు చేసి అందులోనే విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి పూజలు చేసేవారు. ఈ క్రమంలో నిర్మించిన కలిమిగుళ్లు గ్రామమే కాలక్రమంలో కొలిమిగుండ్లగా రూపాంతరం చెందింది. క్రీస్తు శకం 1900 శతాబ్దంలో గద్వాల సంస్థానాన్ని సందర్శించిన కొలిమిగుండ్లకు చెందిన కవి బోయన నరసింహులు అక్కడ ప్రదర్శించిన తన సాహిత్యంలో కలిమిగుళ్ల గురించి, వాటి ప్రాశస్త్యం గురించి విపులంగా విశదీకరించినట్లు చరిత్ర చెబుతోంది. 9వ శతాబ్దంలో పల్లవరాజుల వంశానికి చెందిన రాజు రాజమహేంద్రవర్మ శైవమత ప్రచారంలో భాగంగా అద్భుతమైన కళా నైపుణ్యంతో ఈ కలిమిగుళ్లు నిర్మించారు. వీటినే స్థానికులు మూడుగుళ్లుగా పిలుస్తారు. వాస్తవానికి ఇవి నాలుగు గుళ్లు. కానీ దూరం నుంచి ఎటువైపు చూసినా మూడుగుళ్లుగా మాత్రమే కనిపిస్తాయి. ఇదే కలిమిగుళ్ల నిర్మాణ ప్రత్యేకతగా చెబుతారు. పల్లవ రాజులు శైవ మతానికి చెందిన వారు కావడంతో శైవమత ప్రచారంలో భాగంగా ఈ నాలుగు గుళ్లు నిర్మించి, ఇందులో గణపతి, పార్వతీదేవి, ఈశ్వరుడు, వీరభద్ర స్వాములను ప్రతిష్టించారు. ఈశ్వరునికి ఉత్తర దిశలో వీరభద్రుడు, గణపతి, పడమరలో పార్వతీదేవి, తూర్పు మధ్య భాగంలో ధ్వజస్తంభం, ఈశాన్యంలో నాగులకట్ట, దక్షిణ ఆగ్నేయంలో దిగుడు బావి, నైరుతి దిశలో జమ్మి చెట్టు ఉన్నాయి.

శిథిలావస్థలో మూడుగుళ్లు

ఎంతో విశిష్టత కలిగిన ఈ మూడు గుళ్లు (కలిమి గుళ్లు) ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. విగ్రహాలు, ధ్వజస్తంభం, బావి ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. ఈ గుళ్ల సంరక్షణకు ఎటుంటి మాన్యాలు లేకపోవడంతో ఈ గుళ్లు ఆలనాపాలనాకు నోచుకోక శిథిలమవుతున్నాయి. స్థానికులు వీటి పరిసరాలను ఆక్రమించి పెంట దిబ్బలుగా ఉపయోగించుకుంటున్నారు. 1995లో ఈ ఆలయాలపై అనంతపురానికి చెందిన ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ వారు పరిశోధించి ఆలయ ప్రాంగణంలో తవ్వకాలు జరపగా సింధూ నాగరికత అవశేషాలు లభించాలయని స్థానిక పెద్దలు వెల్లడిస్తున్నారు.

రాష్ట్రంలో మూడు చోట్ల ఈ ఆలయాలు

అత్యంత అరుదైన కట్టడాలుగా భావించే ఈ శిల్పకళ కలిగిన గుళ్లు రాష్ట్రంలో మూడు చోట్ల ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. బనగానపల్లె మండలంలోని నందవరం, చిత్తూరు జిల్లా వాయల్పాడు గ్రామంలో ఈ కలిమి గుళ్లను పోలి ఉన్న గుళ్లు ఉన్నాయి. ఎంతో ప్రాధాన్యతను విశష్టతను కలిగి ఉండటంతోపాటు కొలిమిగుండ్ల ఆవిర్భావానికి రూపాంతరాలైన కలిమిగుళ్లను సంరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Nov 08 , 2024 | 11:57 PM