ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నవంబరు నుంచి రేషన్‌లో కందిపప్పు, పంచదార, జొన్నలు

ABN, Publish Date - Oct 31 , 2024 | 03:53 AM

రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులందరికీ నవంబరు నుంచి ఉచిత బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఐదేళ్ల తర్వాత అన్ని రకాల సరుకుల పంపిణీకి చర్యలు

అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులందరికీ నవంబరు నుంచి ఉచిత బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు సరిపడా సరుకులు రవాణా చేసేలా పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. నవంబరు 1 నుంచి కార్డుదారులందరికీ రేషన్‌ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర కిలో రూ.180పైనే ఉంది. పంచదార రేటు కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో నవంబరు నుంచి బియ్యంతోపాటు సబ్సిడీ ధరలకు నాణ్యమైన కందిపప్పు, పంచదారను అందించి పేదలను ఆదుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పౌరసరఫరాలశాఖ అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి.. కిలో కందిపప్పు రూ.67కు, అరకిలో పంచదార రూ.17కు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా, జొన్నలు కావాలనుకునేవారు బియ్యానికి బదులుగా ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు జొన్నలు తీసుకోవచ్చని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ జి.వీరపాండియన్‌ తెలిపారు.

ధరల నియంత్రణకు రాష్ట్ర, జిల్లా కమిటీలు

రాష్ట్రంలో ధరల నియంత్రణకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. రాష్ట్రస్థాయి కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ చైర్మన్‌గా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌, ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి జి.వీరపాండియన్‌ మెంబరు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వివిధ శాఖల కమిషనర్లు, కార్యదర్శులు, కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ఎండీలు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా ఆయా జిల్లాల కలెక్టర్లు చైర్మన్లుగా, జిల్లా పౌరసరఫరాల అధికారులు మెంబరు కన్వీనర్లుగా, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సభ్యులుగా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - Oct 31 , 2024 | 03:53 AM