AP Election Results: ఏపీ రాజకీయాల్లో సూపర్ స్టార్ కేకే
ABN, Publish Date - Jun 04 , 2024 | 02:00 PM
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొత్తం 7 దశల్లో జరిగాయి. జూన్ 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఆ క్రమంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అందులోభాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుస్తుందని కొన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొత్తం 7 దశల్లో జరిగాయి. జూన్ 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఆ క్రమంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అందులోభాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుస్తుందని కొన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి. మరికొన్ని మాత్రం వైసీపీ మళ్లీ అధికారం చేపడుతుందంటూ వివిధ సంస్థలు ప్రకటించాయి. అయితే కూటమి సునామీ సృష్టించబోతుందని మాత్రం ఎవరు ప్రకటించ లేదు.
కానీ ఒకే ఒక్క సర్వే సంస్థ.. అదీ కూడా కేకే సర్వే మాత్రం ఈ ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించబోతుందంటూ క్లియర్ కట్‌గా ప్రకటించింది. ఇంకా చెప్పాలంటే.. తన ఎగ్జిట్ పోల్‌ను ఎగ్జాట్ పోల్‌గా లెక్కించి మరి కేకే సర్వే వెల్లడించింది. దీంతో ఈ ఎన్నికల ఫలితాల్లో కేకే సర్వే చెప్పినట్లు.. కూటమి 161 స్థానాల్లో అధిక్యత కనబరుస్తుంది. దీంతో జాతీయ, స్థానిక సర్వేలకు భిన్నంగా సర్వే చేసిన కేకే సర్వే ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే హైదరాబాద్ వేదికగా ఇచ్చిన ఈ కేకే సర్వే ఎగ్జిట్ పోల్ ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది.
మరోవైపు ఆరా మస్తాన్ లాంటి వాళ్లు తమ సర్వే ప్రకారం వరుసగా రెండోసారి ఏపీలో వైసీపీ అధికారం చేపట్టనుందని ప్రకటించింది. అంతేకాదు.. ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడెక్క గెలువ బోతున్నారు, మరెక్కడెక్కడ ఓటమి చవి చూడబోతున్నారో.. ఆరా మస్తాన్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు. కానీ ఈ ఎన్నికల ఫలితాల్లో ఆయన సర్వే పూర్తిగా అవాస్తవమైంది.
ఈ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయం నమోదు చేస్తుందని ఇటీవల కేకే సర్వే తెలిపింది. మొత్తం175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ కేవలం14 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. ఇక టీడీపీ పోటీ చేసిన 144 అసెంబ్లీ స్థానాల్లో 133 స్థానాలను ఆ పార్టీ గెలుచుకోబోతుందని చెప్పింది. ఇక జనసేన 21 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపితే.. వారంతా విజయం సాధించనున్నారని ప్రకటించింది.
అలాగే బీజేపీ బరిలో దింపిన 10 మంది అభ్యర్థుల్లో ఏడుగురు మాత్రమే విజయం సాధిస్తారని కేకే సర్వే స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల ఫలితాలకు, కేకే సర్వేకు పూర్తిగా సామిప్యం ఉందని తాజా ఫలితాలతో స్పష్టమైంది. దాంతో కేకే సర్వేను ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆ క్రమంలో ఏపీ రాజకీయాల్లో సూపర్ స్టార్ కేకే అని ఓ చర్చ సైతం వాడి వేడిగా పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.
Read Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Jun 04 , 2024 | 02:00 PM