100 రోజుల అద్భుత పాలన: గన్నే ప్రసాద్
ABN, Publish Date - Sep 21 , 2024 | 01:44 AM
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో 100 రోజుల్లో అనేక అద్భుతాలు చేసిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్(అన్న) అన్నారు.
వన్‌టౌన్, సెప్టెంబరు 20: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో 100 రోజుల్లో అనేక అద్భుతాలు చేసిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్(అన్న) అన్నారు. ఆటోనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాల యంలో శుక్రవారం కూటమి ప్రభుత్వ పాలన 100 రోజుల పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. గన్నే ప్రసాద్‌తో పాటు టీడీపీ నాయకులు సింహాద్రి కన కాచారి, మాజీ కార్పొరేటర్ నరసింహచౌదరి తదితరులు కేక్ కట్ చేశారు. జగన్‌రెడ్డి పాలనలో అప్పులు పాలైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని గన్నే ప్రసాద్ అన్నారు. చెన్నుపాటి ఉషారాణి, గొల్లపూడి నాగేశ్వరరావు, గరిమెళ్ల నరేంద్ర, పొన్నం రవికుమార్, కోడూరు ఆంజనేయ వాసు, పామర్తి కిషోర్‌బాబు, భక్తుల దుర్గారావు, దేవరపల్లి ఆంజనేయులు, అబిద్ హుస్సేన్, జాస్తి సురేష్, యార్ల గడ్డ రమేష్, సజ్జా రవి పాల్గొన్నారు.
Updated Date - Sep 21 , 2024 | 01:44 AM