ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

268 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN, Publish Date - Nov 16 , 2024 | 01:07 AM

ఆటోనగర్‌ ఇండ స్ట్రియల్‌ ఎస్టేట్‌లోని ఓ పాడుబడిన గోదాములో రేషన్‌ బియ్యం భారీ డంప్‌ను గురువారం రాత్రి పౌరసరఫరాల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న బియ్యంతో పౌరసరఫరాల అధికారులు

మొగల్రాజపురం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఆటోనగర్‌ ఇండ స్ట్రియల్‌ ఎస్టేట్‌లోని ఓ పాడుబడిన గోదాములో రేషన్‌ బియ్యం భారీ డం ప్‌ను గురువారం రాత్రి పౌరసరఫరాల అధికారులు స్వాధీనం చేసుకు న్నారు. ఎస్టేట్‌ 2వ రోడ్డులో కొందరు గొడవ పడుతున్నారని, పటమట పోలీసులకు సమాచారం వచ్చింది. సిబ్బందితో ఎస్‌ఐ రేవతి అక్కడికి చేరు కున్నారు. పోలీసులను చూసి గొడవ పడుతున్న వారు పరారయ్యారు. అక్కడ పరిశీలిస్తే గోదాములో బియ్యం బస్తాలు కనిపించాయి. వెంటనే డీఎస్వో పాపారావుకు ఆమె సమాచారం ఇచ్చారు. డీఎస్వో తన సిబ్బం దితో వచ్చి పరిశీలిస్తే 26,890 కిలోల బియ్యం(268 క్వింటాళ్లు) తెల్ల సం చుల్లో ప్యాకింగ్‌ చేసి రవాణాకు సిద్ధంగా ఉన్నాయి. గోత్రపు రమేష్‌ బియ్యాన్ని నిల్వ చేసినట్లు గుర్తించారు. అతనిపై 6ఏ కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని కొండపల్లిలో ఉన్న బీఎస్‌ ఆగ్రోస్‌ రైస్‌ మిల్లులో భద్రపరిచారు.

Updated Date - Nov 16 , 2024 | 01:07 AM