సృజనాత్మకతకు ఫెస్ట్
ABN, Publish Date - Nov 19 , 2024 | 12:53 AM
చార్టెడ్ అకౌంటెన్సీ చదువుతున్న విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గడానికి, సృజనాత్మకత పెరగడానికి వైబ్రెన్స్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని సదరన్ ఇండియా చార్టెడ్ అకౌంటెంట్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ విజయవాడ చైర్మన్ వేమూరి వీర పవన్‌కుమార్ చెప్పారు.
సృజనాత్మకతకు ఫెస్ట్
వేమూరి వీర పవన్‌కుమార్
మొగల్రాజపురం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): చార్టెడ్ అకౌంటెన్సీ చదువుతున్న విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గడానికి, సృజనాత్మకత పెరగడానికి వైబ్రెన్స్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని సదరన్ ఇండియా చార్టెడ్ అకౌంటెంట్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ విజయవాడ చైర్మన్ వేమూరి వీర పవన్‌కుమార్ చెప్పారు. ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో మొగల్రాజపురంలో ఒక ఫంక్షన్ హాలులో వైబ్రెన్స్ ఫెస్ట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీఏ విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవడానికి అవసరమైన శిక్షణా తరగతులను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీకాసా విజయవాడ బ్రాంచ్ చైర్మన్ కె. నారాయణ, ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ కార్యదర్శి జయంత్ ఉప్పులూరి, సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్స్ అక్కయ్య నాయుడు, దుర్గా శ్యాంసుందర్, టీవీ రమణ, నాగవల్లి, అమ్ములు, విజయభాస్కర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 19 , 2024 | 12:53 AM