గేదెలు మేపుతుండగా పిడుగుపడి..కాపరి మృతి
ABN, Publish Date - Oct 20 , 2024 | 01:54 AM
పిడుగుపాటుకు ఓ పశువుల కాపరి పొలంలోనే దుర్మరణం చెందాడు.
పెనుగంచిప్రోలు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): పిడుగుపాటుకు ఓ పశువుల కాపరి పొలంలోనే దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనగపాడులో శనివారం మధ్యాహ్నం జరిగింది. మండలంలో కొద్దిసేపు ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఆ సమయంలో పొలంలో గేదె లు మేపుతున్న ధారావత్ బాలాజీ(51)పై పిడుగుపడడంతో అక్కడి కక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Updated Date - Oct 20 , 2024 | 01:54 AM