ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కంపుకొడుతున్న గుడివాడ

ABN, Publish Date - Oct 21 , 2024 | 01:21 AM

గుడివాడ పట్టణం కంపు కొడుతోంది.

విశ్వభారతి పాఠశాల వద్ద దుర్గంధం

వార్డులో పేరుకుపోయిన చెత్త .. వారం రోజులుగా నిలిచిన సేకరణ

(ఆంధ్రజ్యోతి-గుడివాడ): గుడివాడ పట్టణం కంపు కొడుతోంది. వారం నుంచి ఇంటింటి చెత్త సేకరణ నిలిచిపోవడంతో వార్డుల్లో చెత్త పేరుకుపోయింది. చెత్త సేకరించే వాహనాల డ్రైవర్లకు జీతాలు చెల్లించకపో వడంతో వారు విధులకు హాజరు కావడంలేదు. దీనికి ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయడంలో మున్సిపల్‌ అదికారులు విఫలమయ్యారు.

నిలిచిన ఇంటింటి చెత్త సేకరణ..

ఇంటింటి చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా పారిశుధ్య వాహనాలను కాంట్రాక్ట్‌ పద్ధతిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. జనవరి 2024 నాటి నుంచి అక్టోబరు వరకు ఎటువంటి జీతాలను చెల్లించలేదు. కాంట్రాక్టర్‌కు దాదాపుగా రూ.1.25కోట్లు బకాయి ఉన్నట్లు సమాచారం. చెత్త పన్ను(యూజర్‌చార్జీలు) వసూలు చేయడం ద్వారా డ్రైవర్లకు జీతభత్యాలను ఇచ్చేవారు. దసరా పండుగ నాటికి జీతాలు చెల్లించకపోవడంతో డ్రైవర్లు చెత్త సేకరణను నిలుపుదల చేశారు. దీంతో ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోయింది, దుర్గంధం వెదజల్లుతోంది.

పనికి రాని పుష్‌కార్టులు... సరిపడా లేని ట్రాక్టర్లు...

ఐదేళ్ల వైసీపీ పాలనలో మునిసిపాలిటీకి చెందిన ట్రాక్టర్లకు చిన్నపాటి మరమ్మతులు కూడా చేయకుండా వదిలేశారు. పారిశుధ్య నిర్వహణలో అలసత్వం, మున్సి పాలిటీకి చెందిన ట్రాక్టర్లు, పుష్‌కార్టులను మరమ్మతులు చేయకుండా వదిలేశారు. పారిశుధ్య నిర్వహణ పేరుతో కోట్లల్లో సొమ్మును నొక్కేశారన్నా ఆరోపణలూ ఉన్నాయి. కైకాల కళామందిరం ఆవరణలో పుష్‌కార్టులను గుట్టగా పడేశారు. వినియోగానికి పనికి రాని విధంగా తయార య్యాయి.ప్రసుత్తం20 పుష్‌కార్టులు అందుబాటులో ఉన్నా 36వార్డులకు వినియోగించలేరు. వార్డుకు 3 చొప్పున చెత్తసేకరణకు కనీసం 100 పుష్‌కార్టుల అవసరముంది. పాతపద్ధతిలో పుష్‌కార్టుల ద్వారా చెత్తను సేకరించాలనే ఆలోచన చేస్తున్నారు.

ప్రధాన రహదారులు శుభ్రం చేయిస్తూ..

వార్డుల్లో పరిస్థితి దారుణంగా ఉన్నా, ప్రధాన రహ దారులను శుభ్రం చేయిస్తూ మున్సిపల్‌ అధికారులు మసిపూసి మారేడుకాయగా చేస్తున్నారు. సిబ్బంది సరిపడాలేరు. అదనంగా 90మంది అవసరం ఉంది.

కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

ఇప్పటికే వైరల్‌ జ్వరాలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వాతావరణ మార్పుతో పట్టణ ప్రజలు వైరల్‌ జ్వరాల బారిన పడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ప్రతి ఇంటిలో కనీసం ఇద్దరైనా వైరల్‌ జ్వరాల బారిన పడినవారే. చెత్త సేకరణపై అధికారులు దృష్టిపెట్టాలని లేని పక్షంలో తామంతా వ్యాధుల బారినపడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెత్త సేకరణకు ట్రాక్టర్లు ఏర్పాటు

సమస్య పరిష్కారం అయ్యేలోపు అద్దె ప్రాతిపదికన మూడు ట్రాక్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. కొత్త ఫుష్‌కార్టులు కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అప్పటి వరకు చెత్తసేకరణ కొనసాగుతుంది.

శ్రీనివాస్‌, మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌

Updated Date - Oct 21 , 2024 | 01:21 AM