సబ్సిడీపై వెయ్యి టన్నుల టమాటా
ABN, Publish Date - Oct 20 , 2024 | 02:09 AM
రాష్ట్రంలో వెయ్యిటన్నుల టమాటాను సబ్సిడీపై రైతుబజార్ల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందజేసిం దని వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ఎం.విజయసునీత తెలిపారు.
రైతుబజార్ల ద్వారా ప్రజలకు అందించాం: వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ కమిషనర్ విజయసునీత
ఉయ్యూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వెయ్యిటన్నుల టమాటాను సబ్సిడీపై రైతుబజార్ల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందజేసిం దని వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ఎం.విజయసునీత తెలిపారు. ఉయ్యూరు రైతుబజార్‌లో సబ్సిడీ టమాటా స్టాల్‌ను శనివారం ఆమె పరిశీ లించారు. భారీ వర్షాలు, వరదల వల్ల టమాట, ఉల్లిపాయల దిగుబడి గణ నీయంగా తగ్గిందని, దీంతో ధరలు పెరిగాయని, వీటి నియంత్రణకు ప్రభు త్వం చర్యలు తీసుకుందని ఆమె తెలిపారు. గతంలో కిలో రూ.75 పలికిన టమాటాను ప్రస్తుతం రూ.40కు తెచ్చామన్నారు. రానున్న కార్తీక మాసం లోనూ ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామ న్నారు. ఉయ్యూరు రైతుబజార్ పల్లంగా ఉందని, వర్షం నీరుపోయే మార్గం లేక నీరు నిలిచి బురదకయ్యగా మారుతోందని విలేకరులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. చుట్టూ ప్రహరీ నిర్మాణం, మెరక పనులు చేసి నీరు నిల్వకుండా చూస్తా మని విజయసునీత తెలిపారు. మార్కెటింగ్‌శాఖ రీజినల్ జాయింట్ డైరె క్టర్ శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ లావణ్య, జిల్లా అగ్రిట్రేడ్, మార్కెటింగ్ అధికారి నిత్యానందం, రైతుబజార్ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Updated Date - Oct 20 , 2024 | 02:09 AM