షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్‌పై చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - Dec 09 , 2024 | 01:19 AM
వెలమ సామాజికవర్గాన్ని కించపరస్తూ, అసభ్యభాషలో దుర్భాషలాడిన తెలంగాణ రాష్ట్రం షాద్‌నగర్ ఎమ్మెల్యే వీరవల్లి శంకర్‌పై చర్యలు తీసుకోవాలని వెలమ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.
వెలమ సంక్షేమ సంఘం డిమాండ్
ధర్నాచౌక్, డిసెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): వెలమ సామాజికవర్గాన్ని కించపరస్తూ, అసభ్యభాషలో దుర్భాషలాడిన తెలంగాణ రాష్ట్రం షాద్‌నగర్ ఎమ్మెల్యే వీరవల్లి శంకర్‌పై చర్యలు తీసుకోవాలని వెలమ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. గాంధీనగర్‌లోని సంఘం కార్యాలయంలో ఆదివారం ప్రెస్‌మీట్‌లో సంఘం నేతలు మాట్లాడారు. తమ కులాన్ని కించపరచిన ఎమ్మెల్యే, దాన్ని సోషల్‌మీడియాలో వైరల్ చేసిన వారిపై చట్టప్రకా రం చర్యలు తీసుకోవాలని విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఘంటా శ్రీనివాసరావు, శిరిపురపు కిరణ్‌కుమార్, కోశాధికారి ఘంటా శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు రుత్తల అప్పలస్వామి పాల్గొన్నారు.
Updated Date - Dec 09 , 2024 | 01:19 AM