ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమరావతికి మళ్లీ అంకురార్పణ

ABN, Publish Date - Oct 20 , 2024 | 01:05 AM

అమరావతి రాజధాని పునర్నిర్మా ణానికి కూటమి ప్రభుత్వం బాటలు వేసింది. ఎక్కడి కక్కడ నిలిచిపోయిన పనులను అధికారంలోకి వచ్చిన ఐదో నెలలోనే తిరిగి ప్రారంభించింది.

రాజధానిలో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం

శాస్త్రోక్తంగా పూజలతో రాయపూడి వద్ద పనుల ప్రారంభం

రైతుల హర్షధ్వానాల మధ్య సీఎం చంద్రబాబు భూమిపూజ

మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి కావాలని సీఎం ఆదేశం

తుళ్లూరు, గుంటూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : అమరావతి రాజధాని పునర్నిర్మా ణానికి కూటమి ప్రభుత్వం బాటలు వేసింది. ఎక్కడి కక్కడ నిలిచిపోయిన పనులను అధికారంలోకి వచ్చిన ఐదో నెలలోనే తిరిగి ప్రారంభించింది. వైసీపీ ప్రభు త్వం అడివిలా మార్చిన రాజధాని ప్రాంతంలో తొలుత జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం చంద్రబాబు రాజధాని అంతటా పర్యటించారు. నిలిచిపోయిన పనులను పరిశీలించి వాటిని ఎలా తిరిగి పట్టాలెక్కించాలనే దానిపై అవగాహనకు వచ్చారు. మరోవైపు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తరచూ అమరావతిలో పర్యటించి పనుల పునః ప్రారంభానికి బాటలు వేశారు. ఈ పరిస్థితుల్లో ఎప్పటి నుంచి అమరావతి పనులు ప్రారంభిస్తారని రాజధాని ప్రాంత ప్రజలే కాకుండా రాష్ట్రమంతటా ఎదురు చూస్తున్న క్రమంలో శనివారం సీఎం చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ చేశారు. ప్రజల హర్షధ్వానాల మధ్య శాస్త్రోక్తంగా పూజలతో రాజధాని పనులను ప్రారంభించారు. రాయపూడి వద్ద జీ ప్లస్‌ 7 విధా నంలో నిర్మించతలపెట్టిన సీఆర్డీయే కార్యాలయం నిర్మాణం గత ప్రభుత్వంలో నిలిచిపోగా దాని నిర్మాణం పూర్తి చేసేందుకు పనులు పునః ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడారు. అమరావతిలో రూ.160 కోట్లతో జీ ప్లస్‌ 7 భవనం నిర్మిస్తున్నామని దీనిని 121వ రోజున ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతే రాజధాని అని విశాఖ, కర్నూలు వాసులతో ఒప్పించానన్నారు. రైతులకు కౌలు పెండింగ్‌ నిధులు 170 కోట్లు ఇచ్చామని, రూ.225 కోట్లు త్వరలో ఇస్తామన్నారు. రాజధాని ఉద్యమ సమయంలో ఇక్కడి మహిళలు రాణీరుద్రమ దేవిలా పోరాడారన్నారు. 1,631 రోజులు పాటు రాజధానిని కాపాడుకోవడం కోసం రైతులు ఉద్యమం చేశారని చంద్రబాబు తెలి పారు. విధ్వంసం పోయింది.. నిర్మాణం ప్రారంభమైంద న్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, కలెక్టర్‌ నాగలక్ష్మి, సీఆర్డీఏ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌, అడిషనల్‌ కమిషనర్‌ జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 01:05 AM