ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijayawada: అర్ధరాత్రి అంగన్‌వాడీలను అరెస్టు చేసిన పోలీసులు

ABN, Publish Date - Jan 22 , 2024 | 08:53 AM

విజయవాడ: తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్ శిబిరంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్‌వాడీలను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. శిబిరంలో ఉన్న సుమారు 2వేల మందిని మూకుమ్మడిగా పోలీసులు అరెస్టులు చేశారు. టెంట్ కూల్చేసి, లైట్లు ఆపేసి మహిళలను బలవంతంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో ఎక్కించారు.

విజయవాడ: తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్ శిబిరంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్‌వాడీలను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. శిబిరంలో ఉన్న సుమారు 2వేల మందిని మూకుమ్మడిగా పోలీసులు అరెస్టులు చేశారు. టెంట్ కూల్చేసి, లైట్లు ఆపేసి మహిళలను బలవంతంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో ఎక్కించారు. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్‌వాడీ నేతలను కూడా పోలీసులు బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించారు. నిద్రపోతున్న అంగన్‌వాడీల మీద పోలీసులు జులుం ప్రదర్శించారు. అర్ధరాత్రి మూడు గంటలు.. ఎవరూ లేని సమయంలో మీడియా కూడా లేని సమయంలో పోలీసులు అరెస్టులు చేశారు. వారిని బందరుకు తరలించారు.

అంగన్‌వాడీ మహిళల దీక్ష శిబిరాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న మహిళలను లేపి అరెస్టు చేశారు. ప్రభుత్వం చర్యలపై అంగన్‌వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ మహిళలు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరామని.. 42 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి దీక్ష శిబిరంపై వందలాది మంది పోలీసులుతో దాడి చేయించారని, నిద్ర పోతున్న వారిని లేపి అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ‘నా అక్క చెల్లెమ్మలు అనే జగన్ అంగన్‌వాడీలపై పోలీసులతో దాడి చేయిస్తారా?.. ఇటువంటి అరెస్టులకు బెదిరేది లేదు... సమ్మె కొనసాగిస్తాం..’ అంటూ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని అన్నారు.

ఎన్టీఆర్ జిల్లా:

కాగా సోమవారం చలో విజయవాడకు అంగన్‌వాడీలు పిలుపిచ్చారు. దీంతో విజయవాడకు వస్తున్న అంగన్‌వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. నందిగామ వై జంక్షన్ వద్ద, తనిఖీలు చేస్తున్న పోలీసులు.. 20 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరు జిల్లా:

మంగళగిరి కాజా టోల్ గేట్ దగ్గర అంగన్‌వాడీలు నిరసన చేపట్టారు. చలో విజయవాడకు వెళ్తున్న అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా అంగన్‌వాడీలు రోడ్డుపై బైఠాయించారు.:

రాజమండ్రి:

ఛలో విజయవాడకు వెళుతున్న అంగన్‌వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో అంగన్‌వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

Updated Date - Jan 22 , 2024 | 08:53 AM

Advertising
Advertising