ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల విషయంలో అయోమయం

ABN, Publish Date - Nov 20 , 2024 | 10:00 AM

Andhrapradesh: ప్రశ్నోత్తరాల విషయంలో సభలో అయోమయం నెలకొంది. ఒక శాఖకు సంబంధించిన ప్రశ్నలు వేరే శాఖలకు వెళ్లడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉభయసభల్లో మంత్రికి ఒకే ప్రశ్న రావడంపైనా మండిపడ్డారు స్పీకర్. ఈ అయోమయానికి కారణం అధికారుల నిర్లక్షమే స్పీకర్ ఆగ్రహించారు.

AP Assembly budget Session

అమరావతి, నవంబర్ 20: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyanna patrudu) ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాల విషయంలో సభలో అయోమయం నెలకొంది. ఒక శాఖకు సంబంధించిన ప్రశ్నలు వేరే శాఖలకు వెళ్లడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉభయసభల్లో మంత్రికి ఒకే ప్రశ్న రావడంపైనా మండిపడ్డారు స్పీకర్. ఈ అయోమయానికి కారణం అధికారుల నిర్లక్షమే స్పీకర్ ఆగ్రహించారు. అధికారులు తమ శాఖకు వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారంటూ స్పీకర్ ప్రశ్నించారు.

Gold and Silver Rates Today: మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..


ఇళ్ళ స్థలాల, ఇళ్లు పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారని స్పీకర్ అడిగారు. అధికారులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే గోదావరి పుష్కరాల పనులు విషయంలో జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడుకు ప్రశ్న వెళ్లింది. ఇదే సమయంలో మండలిలో గాలేరు నగరి, హంద్రీనీవా అనుసంధాన ప్రాజెక్టుపై ప్రశ్న ఇచ్చారు. దీనిపైనా స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే మంత్రికి ఉభయసభల్లో ఎలా ప్రశ్న వేస్తారనే క్వశ్చన్ చేశారు. ఉభయ సభల్లో మంత్రికి ఒకే సమయంలో ప్రశ్న రావడంపై విస్మయం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుతో ప్రశ్నత్తరాల సమయంలో సభలో కాసేపు అయోమయ పరిస్థితి నెలకొంది.


కాగా.. శాససభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతిపై సంతాప తీర్మానం చేయనున్నారు. రూల్ 344 కింద కూట‌మి ప్రభుత్వం 150 రోజుల పాలన‌లో అభివృద్ధి, సంక్షేమ ప‌థకాల‌పై శాసన సభలో చ‌ర్చించనున్నారు. ఈరోజు సభలో పలు బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నారు. విశాఖ రుషికొండపై నిబంధన‌ల‌కు విరుద్ధంగా నిర్మించిన భ‌వ‌నాలపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. అలాగే నూత‌న మద్యం పాల‌సీపై సభలో మంత్రి కొల్లు రవీంద్ర స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు.


సభ్యులు అడిగే ప్రశ్నలు ఇవే

ఇళ్ల స్థలాల పంపిణీలో అవ‌క‌త‌వ‌క‌లు

పశుసంవర్ధక శాఖలో ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేట‌ర్లు కోనుగోలు.

ఓడ‌రేవులు, ఫిషింగ్ హార్బర్లు

గోదావ‌రి పుష్కరాలు

ఆదోని ఆటోన‌గ‌ర్ అభివృద్ది

ఎన్టీఆర్ సృజ‌ల స్రవంతి ప‌థకం.

విశాఖ డైరీ

రాష్ట్రంలో క్రీడా మైదానాలు.

పేద‌లంద‌రికి ఇళ్లు

రాష్ట్రంలో జ‌న‌రిక్ మందులు


సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులు

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టసవరణ - 2024

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ ఇండియన్ ఫారెన్ మేడ్ లిక్కర్, ఫారెన్ మేడ్ లిక్కర్ చట్ట సవరణ - 2024

ద్రవ్య వినిమయ బిల్లు - 2024

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు -2024


ఇవి కూడా చదవండి...

రెహ్మాన్ డైవర్స్.. అమీన్ ఎమోషనల్

పోస్ట్ఉడుము పవర్ అంటే ఇదీ..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 20 , 2024 | 10:10 AM