AP Govt: రాజధాని అమరావతి పనులపై సర్కార్ కీలక ప్రకటన
ABN, Publish Date - Dec 10 , 2024 | 12:48 PM
Andhrapradesh: ఏపీ రాజధాని అమరావతితో ఆగిపోయిన పనులను వెంటనే పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 20 పనులకు ఇటీవల సీఆర్‌డీఏ అథారిటీ మీటింగ్ ఆమోదం తెలిపింది. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది. రాజధానిలో అసంపూర్తి గా ఉన్న 20 పనులకు మొత్తం 11 వేల 467 కోట్ల రూపాయలకు సర్కార్ పరిపాలన ఆమోదం తెలిపింది.
అమరావతి, డిసెంబర్ 10: రాజధాని అమరావతి (AP Capital Amaravati) పనులు ఇకపై ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోనున్నాయి. ఆగిపోయిన పనులను వెంటనే పునరుద్ధరించేందుకు ప్రభుత్వం (AP Govt) ఆమోదం తెలిపింది. మొత్తం 20 పనులకు ఇటీవల సీఆర్‌డీఏ అథారిటీ మీటింగ్ ఆమోదం తెలిపింది. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది. రాజధానిలో అసంపూర్తి గా ఉన్న 20 పనులకు మొత్తం 11 వేల 467 కోట్ల రూపాయలకు సర్కార్ పరిపాలన ఆమోదం తెలిపింది. కొద్దిసేపటి క్రితం జీవో నంబర్ 968 ప్రభుత్వం జారీ చేసింది.
రాంగోపాల్ వర్మకు గుడ్ న్యూస్
ఇందులో ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ అధికారుల నివాస సముదాయాలు ఉన్నాయి. 2019 లో వైసీపీ ప్రభుత్వం రాగానే నిలిపివేసిన పలు పనులు పునఃప్రారంభం చేసేందుకు ఆమోదం లభించింది. దీంతో రెండు రోజుల్లో టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం పిలువనుంది. ఇక రాజధాని పనులు స్పీడ్ ట్రాక్‌లో పెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా మొత్తం 20 పనులను పూర్తి చేసేందుకు గాను జీవో నెంబర్ 968ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఏపీ రాజధాని అమరావతి పనులు వేగవంతం కానున్నాయి. 2014 నుంచి 2019 వరకు భూసమీకరణ, లేఅవుట్ పనులు వేగవంతంగా జరిగాయి. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఒక్కసారిగా ఆ పనులను నిలిపివేయడంతో భవనాలన్నీ కూడా పాడుబడిపోయిన పరిస్థితి ఏర్పడింది. చివరకు పిచ్చిచెట్లు, కంప చెట్లు పెరిగినప్పటికీ కూడా వాటిని తొలగించలేదు గత ప్రభుత్వం. తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని పనులను వేగవంతం చేయాలని నిర్ణయించింది. దీనికి ప్రపంచ బ్యాంకులు, ఏడీబీ నుంచి 15వేల కోట్ల రుణాలకు సంబంధించి ప్రతిపాదనలు పూర్తి అయ్యి.. మంజూరు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ నిధులు రానున్నాయి. గతంలో పిలిచిన టెండర్ల కాలపరిమితి పూర్తి అవడంతో వాటిని రద్దు చేసి... కొత్త టెండర్లను పిలవాలని సీఆర్డీఏ అథారిటీ నిర్ణయించింది.
అదే విధంగా రాజధానిలో ఇప్పటి వరకు ఉన్న భవనాలను అసంపూర్తిగా ఉండటంతో వాటి స్ట్రక్చరల్ కెపాసిటీ ఎలా ఉందో చూసేందుకు చెన్నై, హైదరాబాద్ ఐఐటీ నుంచి నిపుణులను పిలిపించారు. వారు ఆ భవనాలను పరిశీలించి ఓ రిపోర్టును ప్రభుత్వానికి నివేదించారు. భవనాల పునాదులు బాగుందని ఐఐటీ నిపుణులు తెలపడంతో సీఆర్డీఏ అథారిటీ సమావేశమై.. రాజధానిలో 20 పనులకు రూ.11467 కోట్ల ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నిధులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని ప్రభుత్వ ఆమోదానికి పంపగా ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ పనులన్నింటికీ ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. అంతే కాకుండా కాసేపటి క్రితమే జీవో నెంబర్ 968ని విడుదల చేసింది. పనులను వెంటనే ప్రారంభించేందుకు టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఇందులో ప్రధానంగా అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్‌కు సంబంధించిన భవన సముదాయాలు అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు కొద్దిసేపటి క్రితమే జీవో నెంబర్ 968ను ప్రభుత్వం జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
Lagacharla: లగచర్ల దాడి కేసు.. విచారణలో సంచలన విషయాలు
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 10 , 2024 | 01:15 PM