Ramgopal Varma: రాంగోపాల్‌ వర్మకు ముందస్తు బెయిల్

ABN, Publish Date - Dec 10 , 2024 | 12:04 PM

Andhrapradesh: సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే దర్యాప్తుకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని వర్మకు హైకోర్ట్ స్పష్టం చేసింది.

Ramgopal Varma: రాంగోపాల్‌ వర్మకు ముందస్తు బెయిల్
Ram gopal varma

అమరావతి, డిసెంబర్ 10: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు (Director Ramgopal varma) ముందస్తు బెయిల్ లభించింది. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి లోకేష్‌పై(Minister Lokesh) అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టు (AP High Court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే దర్యాప్తుకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని వర్మకు హైకోర్ట్ స్పష్టం చేసింది.

ఈ నీళ్లు తాగితే 5 రోగాలు వెంటనే మాయం..


కాగా.. వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌, బ్రాహ్మణి, పవన్‌ కల్యాణ్‌ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో వర్మపై ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 10న ఏడు సెక్షన్లతో రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టు‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మని విచారించేందుకు పోలీసులు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాట్లు చేశారు.


ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. అయితే రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వర్మ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. తొలుత నవంబర్ 19న విచారణకు రావాల్సిందిగా వర్మకు పోలీసులు నోటీసులు ఇవ్వగా.. తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నాని వారం రోజులు సమయం ఇవ్వాలని కోరగా.. అందుకు పోలీసులు అంగీకరించారు. తిరిగి వారం రోజుల తర్వాత మరోసారి వర్మకు నవంబర్ 25న విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. రెండో సారి కూడా విచారణకు వర్మ డుమ్మా కొట్టాడు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు వర్మ నివాసానికి వెళ్లిన పోలీసులు.. అక్కడ ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు.

లగచర్ల దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..


అయితే పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న వర్మ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. అలాగే పలు ఛానల్‌కు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాను పరారీలో లేనని.. అసలు పోలీసులు తన ఆఫీసుకే రాలేదంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించగా.. వర్మకు ఊరట లభించింది. రాంగోపాల్‌ వర్మకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తూ తప్పకుండా విచారణకు హాజరుకావాలని ఆర్జీవీకి హైకోర్టు సూచించింది.


ఇవి కూడా చదవండి...

Lagacharla: లగచర్ల దాడి కేసు.. విచారణలో సంచలన విషయాలు

ఆ రైతుల్లో సంతోషం

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 10 , 2024 | 12:31 PM