ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: ఏపీ నూతన పర్యాటక పాలసీ 2024-29 రిలీజ్

ABN, Publish Date - Dec 11 , 2024 | 11:36 AM

Andhrapradesh: ఏపీ నూతన పర్యాటన పాలసీని ప్రభుత్వం విడుదల చేసింది. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పనతో రాష్ట్ర పర్యాటకానికి ఊతం లభించనుంది. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధికి ప్రోత్సాహం, ఉద్యోగాల కల్పన, సాంస్కృతిక మార్పిడి సులభతరం చేసేలా పాలసీ రూపకల్పన చేశారు.

AP new tourism policy 2024-29

అమరావతి, డిసెంబర్ 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పర్యాటక పాలసీ 2024 - 29 జీవో (ఎం.ఎస్. నంబర్ 17) ‌ను బుధవారం ప్రభుత్వం (AP Govt) విడుదల చేసింది. 2025, మార్చి 31తో పాత టూరిజం పాలసీ ముగియనుడటంతో నూతన పర్యాటక పాలసీని సర్కార్ రూపొందింది. స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ -2029లో పలు ముఖ్యాంశాలను పొందుపర్చారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పనతో రాష్ట్ర పర్యాటకానికి ఊతం లభించనుంది. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధికి ప్రోత్సాహం, ఉద్యోగాల కల్పన, సాంస్కృతిక మార్పిడి సులభతరం చేసేలా పాలసీ రూపకల్పన చేశారు. రాష్ట్ర గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ)లో పర్యాటక రంగం వాటా 4.6 శాతం నుంచి 8 శాతానికి పెంచడంతో.. 20 శాతం పైబడి జీవీఏను కంట్రిబ్యూట్ చేయాలన్నది సర్కార్ యోచన. పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలను 12 శాతం నుంచి 15 శాతానికి పెంపొందించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం, విదేశీ పర్యాటకుల రాకలో టాప్ 10 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని చేర్చేలా పర్యాటక పాలసీని రూపొందించారు.

Kadapa: రాఘవరెడ్డి విచారణ.. ఎంపీ అవినాష్‌ మెడకు బిగుస్తున్న ఉచ్చు


దీర్ఘకాలిక పర్యాటక అభివృద్ధికి..

పర్యాటకుడు పెట్టే ఖర్చును (సగటు వ్యయం) రూ.1700 నుంచి రూ.25000 కు పెంచారు. ఏదైనా పర్యాటక ప్రాంతంలో పర్యాటకులు 1 నుంచి 5 రోజులు ఉండేలా మౌలిక వసతులను కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్రంలో పర్యాటకులకు వసతి సామర్థ్యం పెంచే ప్రక్రియలో భాగంగా హోటళ్లలో గదుల సంఖ్యను 3,500 నుంచి 10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, స్థానిక పర్యాటకాన్ని, జనసమూహాలను బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నారు. దీర్ఘకాలిక పర్యాటకం అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. సుస్థిరమైన పర్యాటకాభివృద్ధికి బాటలు వేస్తూ.. పర్యాటక రంగంలో ఉండే వారికి శిక్షణ ఇచ్చి.. వారిలో నైపుణ్యాలు పెంపొందేలా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోనున్నారు.


బాధ్యతాయుతమైన పర్యాటకానికి శ్రీకారం

పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన.. ప్రపంచ స్థాయి అనుభవాలను పర్యాటకులకు అందించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్ది అగ్రస్థానంలో నిలబెట్టాలే చర్యలు తీసుకోనున్నారు. స్థిరమైన పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. బాధ్యతాయుతమైన పర్యాటకానికి శ్రీకారం చుట్టారు. రివర్ క్రూయిజ్‌లు, ఆధ్యాత్మిక పర్యాటకం, ఎకో, వెల్‌నెస్, హెరిటేజ్, అడ్వెంచర్, బీచ్ టూరిజంలను అభివృద్ధి చేయనున్నారు. విశాఖపట్టణం, తిరుపతి, అరకు వ్యాలీ, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, గండికోట ప్రాంతాల్లో యాంకర్ హబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


థీమాటిక్ సర్క్యూట్‌లు..

25కు పైగా థీమాటిక్ సర్క్యూట్‌లు.. అందులో 2 బుద్దిస్ట్ సర్క్యూట్‌లు, 10 టెంపుల్ సర్క్యూట్‌లు, 5 బీచ్ సర్క్యూట్‌లు, 4 రివర్ క్రూయిజ్ సర్క్యూట్‌లు, 3 ఎకో టూరిజం సర్క్యూట్‌లు, 2 సీ క్రూయిజ్ సర్క్యూట్‌లు, సీప్లేన్ సర్క్యూట్‌లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 40 బౌద్ధ స్మారక చిహ్నాలు, చారిత్రక మహాయాన బౌద్ధ మతం యొక్క జన్మస్థలంగా ప్రాముఖ్యత, గొప్ప బౌద్ద వారసత్వంను, చారిత్రక, పురావస్తు అభివృద్ధి చేసేందుకు చర్యలు.. అందులో భాగంగా విశాఖపట్టణం, శాలిహుండం, తొట్ల కొండ, బొజ్జన కొండ, అమరావతి స్థూపం, ఉండవల్లి గుహలు, నాగార్జున కొండ ప్రధానమైనవి. ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్‌లో భాగంగా స్థానికంగా ఉన్న జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, శైవక్షేత్రాలు తదితర ఆలయాలు కలిసేలా సర్క్యూట్‌లు.. సింహాచలం, శ్రీశైలం, అహోబిలం, అన్నవరం, తిరుపతి, కాణిపాకం, లేపాక్షి, విజయవాడ, ద్వారకాతిరుమల, శక్తి పీఠాల అభివృద్ధి చేయనున్నారు.


బీచ్‌ టూరిజం అభివృద్ధి...

రాష్ట్రంలో విశాలమైన 974 కి.మీల సముద్రతీర ప్రాంతంలో బీచ్ టూరిజం అభివృద్ధి చేయనున్నారు. విశాఖపట్టణం, శ్రీకాకుళం, కాకినాడ, నెల్లూరు, మచిలీపట్నంలలో బీచ్ సర్క్యూట్‌లు అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. గోదావరి, కృష్ణా నది ప్రాంతాల్లో విహారయాత్రలకు అనుకూలమైన వాతావరణం సృష్టించడం,పర్యాటకులను ఆకర్షించేలా రివర్ క్రూయిజ్ సర్క్యూట్‌లను అభివృద్ధి చేయనున్నారు.


పర్యావరణహిత పర్యాటకం...

పర్యావరణహిత, బాధ్యతాయుత పర్యాటకం అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. జీవవైవిధ్యాన్ని పరిరక్షించేలా, కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోనున్నారు. ఎకో టూరిజం సర్క్యూట్‌ల అభివృద్ధిలో భాగంగా శ్రీకాకుళం - విశాఖపట్నం, తూర్పుగోదావరి -గుంటూరు, కర్నూలు - నెల్లూరు సర్క్యూట్‌లకు సన్నాహాలు చేయనున్నారు. అందులో భాగంగా అరకులోయ, బెలూం గుహలు, నల్లమల్ల ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణకు ప్రాముఖ్యత, కొండపల్లి ఫారెస్ట్, గండికోట, ఎర్రమట్టి దిబ్బలు, పాపికొండలు, కడియం నర్సరీలను అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే ఎకో టూరిజం అభివృద్ధికి సబ్ కమిటీ ఏర్పాటు అయిన విషయం తెలిసిందే.


ఫిల్మ్ స్టూడియోల ఏర్పాటు..

ఫిల్మ్ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఫిల్మ్ మేకర్‌లను ఆకర్షించేలా ఫిల్మ్ స్టూడియోలను ఏర్పాటు చేయనున్నారు. షూటింగ్‌లకు అనుకూలమైన లొకేషన్లను గుర్తించనున్నారు. ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహించడం, ఫిల్మ్ టూరిజం సర్క్యూట్‌ల అభివృద్ధి.. ప్రసిద్ధ షూటింగ్ స్పాట్‌లను టూరిజం ప్యాకేజీలుగా అనుసంధానించడం, సింగిల్ విండో ఏర్పాటు ద్వారా ఫిల్మ్ పర్మిట్ల కోసం క్లియరెన్స్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు.


పరిశుభ్రతకు పెద్దపీట

అంతర్జాతీయ ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ, హెలీ టూరిజంల అభివృద్ధి, పర్యాటకుడు కేంద్రంగా ప్రజా రవాణా మెరుగుపర్చడం, ప్రయాణం సాఫీగా సాగేలా నాణ్యత గల హైవేలను అభివృద్ధి చేయనున్నారు. రివర్ ఫ్రంట్ ఏరియాను అభివృద్ధి చేయడం, గార్డెన్స్, ఎకో ఫ్రెండ్లీ బోటింగ్ ఏర్పాటు చేయడం, ఎలక్ట్రిక్ బోట్లు ప్రవేశపెట్టడం జల పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు చర్యలు తీసుకోనున్నారు. పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయడం.. సరైన నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పించడం తదితర అంశాలతో పాలసీ రూపకల్పన చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైవ్యాల్యూ టూరిజం ప్రాజెక్టులు ఏపీకి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పర్యాటక రంగం విస్తరణకు ప్రభుత్వం కృషి చేయనుంది.


ఇవి కూడా చదవండి...

జగన్‌ నిర్వాకం.. అమరావతిపై భారం..

టాప్ 5లో.. ‘యే పవన్ నహీ ఆంధీ హై’

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 11:43 AM