ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరోగ్య భారత్‌ సాకారమవ్వాలి

ABN, Publish Date - Oct 20 , 2024 | 02:08 AM

పేదరికం, వివక్షతకు తావులేని ఆరోగ్య భారత్‌ సాకారం కావాలి. అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

వైద్యశిబిరానికి వచ్చిన పేదలను ఆప్యాయంగా పలకరిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

వైద్యసేవలు అందరికీ అందుబాటులో ఉండాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఉంగుటూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘గ్రామీణప్రాంతాల్లో తక్కువ ధరకే మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవడంపై ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్‌ వైద్యసంస్థలు, సేవా సంస్థలు దృష్టి సారించాలి. వైద్యఖర్చుల భరించలేమని పేదలు, మధ్యతరగతి ప్రజలు భయపడే పరిస్థితి రాకూడదు. పేదరికం, వివక్షతకు తావులేని ఆరోగ్య భారత్‌ సాకారం కావాలి.’ అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఆత్కూరు స్వర్ణభారత్‌ట్రస్ట్‌(విజయవాడ చాప్టర్‌)ప్రాంగణంలో ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌, అకిరా కంటి ఆస్పత్రి సౌజన్యంతో శనివారం ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. స్వర్ణభారత్‌ట్రస్ట్‌ స్థాపించిన నాటినుంచి ఇప్పటివరకు 48ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటుచేసి 15వేలమందికి పైగా పేదలకు వైద్యసేవలందించిందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ట్రస్ట్‌ తరఫున సేవలు కొనసాగిస్తామన్నారు. శిబిరానికి విచ్చేసిన రోగులను ఆప్యాయంగా పలకరించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి వెస్ట్‌ ప్రయాగ్‌రాజ్‌, ఎమ్మెల్యే సిద్ధార్థనాఽథ్‌సింగ్‌, స్వర్ణభారత్‌ట్రస్ట్‌ చైౖర్మన్‌ కామినేని శ్రీనివాస్‌, ట్రస్ట్‌ సీఈవో శరత్‌బాబు, ట్రస్ట్‌సభ్యులు పాల్గొన్నారు.

ఫార్మా రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఒప్పందం

ఆత్కూరు స్వర్ణభారత్‌ట్రస్ట్‌(విజయవాడ చాప్టర్‌)లో ఫార్మా రంగంలో నైపుణ్యాభివృద్ధి, వ్యాక్సిన్‌, వైద్య ఉపకరణాల తయారీపై శిక్షణ త్వరలో అందుబాటులోకి రానుంది. శనివారం సువెన్‌ ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ సెక్టార్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎల్‌ఎస్‌ఎస్‌ఎస్‌డీసీ), స్వర్ణభారత్‌ట్రస్ట్‌ల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సమక్షంలో ట్రస్ట్‌ సీఈవో శరత్‌బాబు, ఈడీ పరదేశి, ఎల్‌ఎస్‌ఎస్‌ఎస్‌డీసీ సీఈవో గౌతమ్‌ భట్టాచార్య, సువేన్‌ ఫార్మాకంపెనీ కార్యదర్శి కుందన్‌కుమార్‌ఝాలు సంతకాలు చేశారు.

Updated Date - Oct 20 , 2024 | 02:08 AM