ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బోయపాటి విద్యార్థి అరవింద్‌కుమార్‌ ఎంపిక

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:48 AM

బోయపాటి శివ రామకృష్ణయ్య నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థి కె. అరవింద్‌కుమార్‌ జాతీయ మల్లాఖంబ్‌ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగ రాజు తెలిపారు.

విద్యార్థులను, కోచ్‌ రాజకుమార్‌ను అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌ నాగరాజు, కార్పొరేటర్‌ ఉషారాణి

జాతీయ మల్లాఖంబ్‌ పోటీలకు

బోయపాటి విద్యార్థి అరవింద్‌కుమార్‌ ఎంపిక

మొగల్రాజపురం, నవంబరు 13 (ఆంధ్ర జ్యోతి): బోయపాటి శివ రామకృష్ణయ్య నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థి కె. అరవింద్‌కుమార్‌ జాతీయ మల్లాఖంబ్‌ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగ రాజు తెలిపారు. బుధవారం పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల భీమవరంలో జరిగిన రాష్ట్రస్థాయి మల్లాఖంబ్‌ పోటీలకు పాఠశాల నుంచి 18 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. అండర్‌ 14 లో కె.అలేఖ్య, అండర్‌ 19లో వి.చందు (8వ తరగతి)లు రజిత పతకాలు సాధించారని చెప్పారు. త్వరలో ఉజ్జయినిలో జరిగే జాతీయ పోటీలకు కె. అరవింద్‌కుమార్‌ అర్హత సాధించాడని తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు విద్యార్థులను కార్పొరేటర్‌ సీహెచ్‌ ఉషారాణి అభినందించారు. పాఠశాలను దత్తత తీసుకున్న ఆఽంరఽధా మోటార్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అరవింద్‌ కుమార్‌కు మొమెంటో, బ్యాగ్‌, సర్టిఫికెట్‌ను బహుకరించారు. పోటీల్లో పాల్గొనడానికి అయ్యే ఖర్చులను భరించడానికి ముందుకు వచ్చారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పీడీ ఎం.రాజకుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Nov 14 , 2024 | 12:48 AM