ప్రాథమిక చికిత్సపై అవగాహన అవసరం
ABN, Publish Date - Sep 15 , 2024 | 12:06 AM
ప్రతి ఒక్కరికీ ఫస్ట్ ఎయిడ్‌పై అవగాహన ఉండాలని, సీపీఆర్ ఎలా చేయాలో తెల్సుకోవడం వలన ప్రాణాలు నిలబెట్టవచ్చని రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ సమరం అన్నారు.
ప్రాథమిక చికిత్సపై అవగాహన అవసరం
రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ సమరం
లబ్బీపేట, సెప్టెంబరు14: ప్రతి ఒక్కరికీ ఫస్ట్ ఎయిడ్‌పై అవగాహన ఉండాలని, సీపీఆర్ ఎలా చేయాలో తెల్సుకోవడం వలన ప్రాణాలు నిలబెట్టవచ్చని రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ సమరం అన్నారు. వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా నలంద డిగ్రీ కళాశాలలో శనివారం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిఽథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సెప్టెంబరులో వచ్చే రెండో శనివారం వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే గా జరుపుకుంటామని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసరంగా అందించాల్సిన ప్రాథమిక చికిత్స అందరికి తెలియడం ఎంతో ఉపయోగం అని అన్నారు. ఈ సందర్భంగా వరద బాధితులకు సహాయ సహకారం అందించిన ఎన్‌సీసీ కేడెట్లను యూత్ రెడ్‌క్రాస్ తరపున అభినందించారు. రెడ్‌క్రాస్ సభ్యులైన రాధిక విద్యార్థులకు ప్రాక్టికల్‌గా సీపీఆర్ ఏవిధంగా చేయాలో చూపించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అనురాధ, ఎన్‌సీసీ కేడెట్లు పాల్గొన్నారు.
Updated Date - Sep 15 , 2024 | 12:06 AM