ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వాసుదేవరెడ్డి, కొడాలి నాని, మాధవీలతారెడ్డిపై కేసు

ABN, Publish Date - Jul 07 , 2024 | 12:59 AM

తన తల్లి మరణానికి రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, కృష్ణాజిల్లా పూర్వ జాయింట్‌ కలెక్టర్‌ మాధవీ లతారెడ్డి కారణమయ్యారని గుడివాడ ఆటోనగర్‌కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది.

మాట్లాడుతున్న దుగ్గిరాల ప్రభాకర్‌

తన తల్లి మరణానికి కారణమయ్యారని గుడివాడవాసి దుగ్గిరాల ప్రభాకర్‌ ఫిర్యాదు

గుడివాడ: తన తల్లి మరణానికి రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, కృష్ణాజిల్లా పూర్వ జాయింట్‌ కలెక్టర్‌ మాధవీ లతారెడ్డి కారణమయ్యారని గుడివాడ ఆటోనగర్‌కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. తన తల్లి మరణానికి కారణమయ్యారని, కొడాలి నాని అనుచరులు బెదిరించారని, తన గోడౌన్‌లోని మద్యం కేసులను పగులగొట్టి, తగలబెట్టా రని గతంలో తాను ఫిర్యాదు చేస్తే అప్పుడు పోలీసులు కేసు నమోదు చేయలేదని దుగ్గిరాల ప్రభాకర్‌ ప్రభాకర్‌ తెలిపారు. గోడౌన్‌ అక్రమ తరలింపును ప్రశ్నించినం దుకు తన తల్లి సీతామహాలక్ష్మిని ఆనాటి బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి కృష్ణాజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలతారెడ్డి, కొడాలి నాని తీవ్రంగా దుర్భాషలాడారని, దీంతో మనస్థాపానికి గురై ఆమె మృతి చెందిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేస్తే సాక్ష్యాధారాలతో రావాలని పోలీసులు ఆదేశించారని తెలిసింది. పూర్తి సాక్ష్యాధారాలను సమర్పించ డంతో టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు..రక్షణ కల్పించండి: దుగ్గిరాల

‘‘నాకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయిస్తే, వైసీపీ నేతలు పేర్లు ఎందుకు పెట్టావంటూ రాత్రంతా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. వారి బెదిరింపులతో నాకు ప్రాణ భయం పట్టుకుంది. వారి నుంచి రక్షణ కల్పిం చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు లేఖ రాస్తా. వారి దృష్టికి సమస్యను తీసుకెళ్తా.’’ అని దుగ్గిరాల ప్రభాకర్‌ విలేకరులకు తెలిపారు.

Updated Date - Jul 07 , 2024 | 12:59 AM

Advertising
Advertising
<