చదువులతల్లికి నీరాజనం
ABN, Publish Date - Oct 10 , 2024 | 01:18 AM
విజయవాడ రూరల్ మండలం రామవ రప్పాడులోని వెంకమ్మ పేరంటాలమ్మ దేవస్థానంలో శరన్న వరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారి జన్మనక్షత్రమైన మూలనక్షత్రం రోజున సరస్వతీదేవీగా కొలువు దీరారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంప తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రసాదంపాడు, అక్టోబరు 9 : విజయవాడ రూరల్ మండలం రామవ రప్పాడులోని వెంకమ్మ పేరంటాలమ్మ దేవస్థానంలో శరన్న వరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారి జన్మనక్షత్రమైన మూలనక్షత్రం రోజున సరస్వతీదేవీగా కొలువు దీరారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంప తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవోప్రియాంక, అర్చకులు పూర్ణకుం భంతో స్వాగతం పలికారు.
పెనమలూరు సెంటరులో..
పెనమలూరు : దేవీ నవరాత్రుల సందర్భంగా పెనమలూరు సెంటరు లో ఏర్పాటు చేసిన మండపంలోని అమ్మవారి విగ్రహం వద్ద ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దసరా పండుగ నియోజకవర్గ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
కంకిపాడు శివాలయంలో..
కంకిపాడు : దసరా నవరాత్రి ఉత్స వాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపు కోవాలని ఎమ్మెల్యే బోడెప్రసాద్ అన్నా రు. కంకిపాడు శివాలయంలో 7వ రోజు మూలానక్షత్రం రోజున అమ్మ వారు భక్తులకు సరస్వతీదేవిగా దర్శన మిచ్చారు. బుధవారం ఉదయం కమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుమ్మల చంద్రశేఖ ర్‌తో కలిసి సరస్వతి అమ్మవారిని ఆయన దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్ర మంలో ఉత్సవ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ దివి రోహిణి, పులి శ్రీను, కమిటీ సభ్యులు కొండా నాగేశ్వరరావు, చలవాది రాజా, అడపా నాగశ్రీ, కుంటా గంగాధర్, పార్టీ నాయకులు షేక్ బాజి, కళ్యాణి, శివపార్వతి పాల్గొన్నారు.
సోమేశ్వరస్వామి ఆలయంలో..
ఉయ్యూరు : జగదాంబ సమేత సోమేశ్వ రస్వామి ఆలయంతో పాటు చిన ఓగిరాల చింతలతోట దుర్గా మండపంలో సరస్వతిదేవి గా అలంకరించి చిన్నారులతో పూజలు చే యించారు. గండిగుంట గణపతి సచిదానంద జ్ఞానభోద సభ, పెద ఓగిరాల, ఆకునూరు శివాలయాల్లో అమ్మవారికి పూజలు చేశారు.
ఫకాటూరులో జరుగుతున్న దేవి శరన్నవ రాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవిని బుధవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ దర్శించి పూజలు చేశారు. పార్టీ సీని యర్ నాయకులు వేమూరి శ్రీనివాస రావు, కుప్పాల అంజిబాబు, కోడె హరీశ్, వీరమా చినేని ఉమా పూజలు చేశారు.
లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో..
ఉంగుటూరు : లంకపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన అమ్మవారు పులివాహనంపై వీణాపాణిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు చదలవాడ శివనాగేశ్వరరావు, కుమారస్వా మి విశేషపూజలు జరిపారు. సరస్వతీదేవిగా రాజ్యలక్ష్మి
హనుమాన్‌జంక్షన్ : స్థానిక నూజివీడు రోడ్డులోని లక్ష్మీవేంక టేశ్వరస్వామి దేవస్థానంలో రాజ్య లక్ష్మి అమ్మవారిని శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నరక్షతం పురస్కరించుకొని బుధవా రం సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రంగన్నగూడెంలో..
హనుమాన్‌జంక్షన్ రూరల్ :
రంగన్నగూడెం, వీరవల్లి, రంగ య్యప్పారావుపేట, కొత్తపల్లి గ్రామా ల్లో బుధవారం సరస్వతీదేవి అవతారంలోని అమ్మవారికి విద్యా ర్ధులు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. రంగన్నగూడెంలో నిర్వహిం చిన పూజలో అట్లూరి ఉష విద్యార్ధులకు పూజలో ఉంచిన పెన్నులు, పుస్తకాలను బహుక రించారు.
Updated Date - Oct 10 , 2024 | 01:18 AM