CM Chandrababu: అలాంటి వారికే దివ్యాంగుల పెన్షన్ ఇవ్వండి..
ABN, Publish Date - Dec 12 , 2024 | 10:33 AM
Andhrapradesh: డిజేబుల్డ్ అంటే పనిచేయలేని స్ధితిలో ఉండి అటెండెంట్ ఉంటారు అంటేనే పెన్షన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఫిజికల్లీ హ్యండీక్యాప్డ్ కాని వారు ఫెన్షన్ తీసుకుంటున్నారని తెలిపారు. డమ్ అండ్ డఫ్ విషయంలో వారి విషయంలో ఎవ్వరూ గుర్తించలేరన్నారు.
అమరావతి, డిసెంబర్ 12: వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu naidu) అధ్యక్షతన 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా పీపంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణపేదరిక నిర్మూలన శాఖలపై ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పెన్షన్‌లు అర్హత లేనివారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నిర్వహించిన సర్వేలో ప్రతీ పదివేలకూ 500 మంది వరకూ అనర్హులని తేలినట్టు శశిభూషన్ కుమార్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు 6 లక్షల మందికి హడావుడిగా పెన్షన్లు ఇచ్చారని... ఇందులో చాలా మంది అనర్హులే ఉన్నారని వ్యాఖ్యానించిన మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి జంప్..
చంద్రబాబు ఆదేశాలు..
వచ్చే మూడు నెలల్లోగా ప్రతీ పెన్షన్‌ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ఆదేశించిన ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రులు చనిపోయి చిన్నారులు ఉంటే వారికీ పెన్షన్ ఇవ్వాలని సీఎం సూచించారు. దివ్యాంగులు చాలా మంది రూ. 15 వేలు అడుగుతున్నారని కలెక్టర్లు తెలుపగా.. సదరం ధృవీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. డిజేబుల్డ్ అంటే పనిచేయలేని స్ధితిలో ఉండి అటెండెంట్ ఉంటారు అంటేనే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఫిజికల్లీ హ్యండీక్యాప్డ్ కాని వారు ఫెన్షన్ తీసుకుంటున్నారని తెలిపారు. డమ్ అండ్ డఫ్ విషయంలో వారి విషయంలో ఎవ్వరూ గుర్తించలేరన్నారు. పెన్షన్ రాని విషయం గురించి కాదని.. అర్హత లేనివారికి ఇవ్వకుండా చూడాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.
కలెక్టర్లపై సీఎం ఆగ్రహం...
గ్రామీణ ఉపాధి హామీ పథకం డిమాండ్‌కు అనుగుణంగా నిర్వహించాల్సిన కార్యక్రమం అని పేర్కొన్నారు. వందరోజులు పనిదినాలను సరిగా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. పని దినాలు, మెటీరియల్ కాంపోనెంట్‌ను పూర్తి చేయలేక పోతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. పల్లె పండుగలో 14.8 పర్సెంట్ మాత్రమే పనులు చేశారని ఇంకా నెలన్నర సమయం మాత్రమే ఉందన్నారు. అల్లూరి జిల్లాలో 54 శాతం పూర్తైతే మరో జిల్లాలో 1.6 శాతం మాత్రమే పనులు జరగటంపై చంద్రబాబు ప్రశ్నించారు. పని పూర్తైన వెంటనే బిల్లులు ఎందుకు చెల్లించటం లేదని అడిగారు. కలెక్టర్‌లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ల వద్ద ఉపాధి హామీ డబ్బులు ఉన్నా బిల్లులు ఎందుకు చెల్లించటం లేదని ఆగ్రహించారు. జలజీవన్ మిషన్‌ను గత ప్రభుత్వం మొత్తం దెబ్బ తీసిందని వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించామన్నారు. గ్రామాల్లో కనీసమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు.
కాగా.. రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో పలు అంశాలపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీల అంశాలపై చర్చించనున్నారు. రెండో రోజు హోం, పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, విద్యుత్, మానవవనరులు, ట్రాన్స్ పోర్ట్, రోడ్లు-భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవిన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చిస్తారు. ఈ సమావేశంలో మంత్రులు, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
YSRCP: వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి జంప్..
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 12 , 2024 | 11:04 AM