ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కీలక భేటీ

ABN, Publish Date - Dec 16 , 2024 | 01:23 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు భేటీ అవనున్నారు. జనసేన నేత కొణిదల నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం ముహూర్తంపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసే నేత కొణిదెల నాగబాబుకు క్యాబినెట్‌లో సీఎం చంద్రబాబు బెర్తు కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే.

CM Chandrababu, Deputy CM Pawan Kalyan Meeting

అమరావతి, డిసెంబర్ 16: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో (CM Chandrababu naidu) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం భేటీ కానున్నారు. సీఎం చంద్రబాబుతో రాజకీయ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం. జనసేన నేత కొణిదెల నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తంపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసే నేత కొణిదెల నాగబాబుకు క్యాబినెట్‌లో సీఎం చంద్రబాబు బెర్తు కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే.

AP News: తండ్రి ఉద్యోగం కోసం కూతురి మర్డర్ ప్లాన్‌.. తెలిస్తే షాకవ్వాల్సిందే


సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీలో నేడు నాగబాబు కేబినెట్‌లోకి ఎప్పుడు తీసుకోవాలనే అంశంపై చర్చిస్తారని సమాచారం. ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యాక కేబినెట్‌లోకి తీసుకుంటారా లేదా మంత్రిగా అయ్యాక ఎమ్మెల్సీ పదవి చేపడుతారు అనే అంశంపై చర్చ జరుగనుంది. అలాగే నామినేటెడ్ పదవులపై కూడా చర్చ జరుగనుందని తెలుస్తోంది. జనసేన నుంచి 3వ జాబితాను సీఎంకు పవన్ ఇవ్వనున్నట్లు సమాచారం.


ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తున్నారు. ఆ పర్యటన ముగిసిన అనంతరం నేరుగా సచివాలయానికి చేరుకుని మధ్యాహ్నం 3 గంటల సమయంలో డిప్యూటీ సీఎం పవన్‌తో సమావేశంకానున్నారు. ఇటీవలే జనసేన నేత నాగబాబుకు మంత్రి వర్గం బెర్త్ కన్ఫమ్‌ చేస్తూ సీఎం అధికారికంగా లేఖ ఇచ్చారు. ఇందులో భాగంగా నాగబాబు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపై చర్చంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిపై పలు అంశాలపై కూడా ఇరువురి మధ్య చర్చకు రానుంది. నామినేటెడ్ పదవుల మూడో జాబితా త్వరలో విడుదల కాబోతోంది.

జాకీర్ హుస్సేన్ చివరి పోస్ట్ వైరల్


ఈ నేపథ్యంలో జనసేన నుంచి నామినేటెడ్ పదవుల మూడో జాబితాను సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ అందజేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవులు ఇచ్చేస్తామని కూటమి సర్కార్ చెబుతోంది. ఇదే ఫైనలా లేక.. మరో జాబితా ఉండబోతుందా అనేది సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రిగా నాగబాబు ప్రమాణస్వీకారం, నామినేటెడ్ పదవుల అంశంతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ మధ్య చర్చ నడిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

బాబోయ్.. ఈ టీ వెరీ కాస్ట్‌లీ

తెలంగాణ అసెంబ్లీ.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 16 , 2024 | 01:28 PM