ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: జమిలి అమలు అయినా.. ఎన్నికలు మాత్రం

ABN, Publish Date - Dec 14 , 2024 | 11:30 AM

Andhrapradesh: జమిలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామన్నారు. జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని మండిపడ్డారు.

CM Chandrababu Naidu

అమరావతి, డిసెంబర్ 14: జమిలి కోసం రెండు బిల్లులకు ఇటీవలే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ రెండు బిల్లు మరో రెండు రోజుల్లో పార్లమెంటు ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో జమిలి (Jamili) ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో సీఎం మాట్లాడుతూ.. జమిలీ అమల్లోకి వచ్చినా.. ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అని స్పష్టం చేశారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామన్నారు. జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని మండిపడ్డారు.

YS Sharmila: ఏపీ దశ దిశ మారాలంటే తక్షణం కావాల్సింది అదే


వాళ్లను చేసి నవ్వుతున్నారు..

వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయన్నారు. వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతీ చోటా దీనిపై చర్చ జరగాలన్నారు. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని చెప్పారు. 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకూ కనిపిస్తున్నాయన్నారు. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.


భాగస్వామ్యం అవండి..

స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసే కార్యక్రమం కాదన్నారు. భవిష్యత్తుతరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని అన్నారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని స్పష్టం చేశారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామన్నారు. ఈసారి పెట్టే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఎన్నో మార్పులు తీసుకొస్తామని.. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు - సమాధానాల రూపంలో దీనిని నిర్వహిస్తామన్నారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చించాల్సిన అంశాలపై అజెండా పంపి వాటిపై సమాధానాలు కోరతామని అన్నారు. తద్వారా సమయాన్ని సద్వినియోగం జరగటంతో పాటు మంత్రులు - అధికారుల మధ్య ఇంట్రాక్షన్ పెరుగుతుందన్నారు.


అడ్వాణీ ఆరోగ్య పరిస్థితిపై...

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంపై సీఎం స్పందిస్తూ.. ఆసుపత్రిలో చేరిన అడ్వాణీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఆడ్వాణీతో తనకు దశాబ్దాల కాలం నుంచి అనుబంధం ఉందన్నారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అడ్వాణీ సహకారం మరువలేనిది అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.


వినతుల స్వీకరణ..

కాగా.. ఈరోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు... ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సాగునీటి సంఘాలు, సహకార ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. చంద్రబాబు భేటీలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, దేవినేని ఉమా, చినరాజప్ప, అశోక్ బాబు తదితరులు ఉన్నారు. అంతకుముందుకు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కుమారుడి వివాహ వేడుకలో సీఎం చంద్రబాబు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.


ఇవి కూడా చదవండి..

Nara Lokesh: విద్యారంగంలో సంస్కరణలు తప్పవు

మీడియా ముందుకు ‘పుష్ప’.. అరెస్ట్‌పై ఏమన్నారంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 11:40 AM