ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాసులు.. కేసులు..

ABN, Publish Date - Mar 29 , 2024 | 01:11 AM

‘డ్రంకెన్‌ డ్రైవ్‌ చేపట్టేటప్పుడు పారదర్శకంగా వీడియో తీస్తున్నాం. ఎవరైనా దొరికితే కేసు పెడతాం’ అని ట్రాఫిక్‌ పోలీసులు చెప్పే మాటలు విని అందరూ నిజమే అనుకుంటారు. కానీ, ఈ వ్యవహారమంతా కొన్నిచోట్ల సక్రమంగా జరుగుతున్నా.. సత్యనారాయణపురం మూడో ట్రాఫిక్‌ పోలీసుల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కాసులిస్తే చాలు.. ఎంతటి వారైనా, తాగి వాహనం నడిపినా కేసులు, కోర్టులు లేకుండా ఇక్కడ తేలిగ్గా బయటకొచ్చేయొచ్చు.

కాసులు కురిపిస్తున్న డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

బడాబాబులే టార్గెట్‌గా వసూళ్లు

తాగి వాహనం నడిపినా వదిలేస్తారు

ఇద్దరు కానిస్టేబుళ్ల వసూలు దందా

సత్యనారాయణపురం : డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోయి, తాగినట్టు నిర్ధారణై, పర్సంటేజీ స్లిప్‌ వచ్చి, బండి సీజ్‌ చేసినా మూడో ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు. దీని వెనుక పెద్ద తతంగమే నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైవ్‌లో పట్టుబడిన వారిలో బడాబాబులు ఉంటే ఒక్కొక్కరి వద్ద రూ.10 వేల నుంచి రూ.15 వేలు తీసుకుని కేసు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పుకొంటున్నారు. అలాంటి వారి వద్ద కనీసం ఆధార్‌ కార్డు తీసుకోవట్లేదు. వాహనాలు పట్టుకున్నా వెంటనే ఇచ్చేస్తున్నారు. అదే సామాన్యుడైతే కోర్టులో జరిమానాతో పాటు ట్రాఫిక్‌ పోలీసులకు చేతులు తడిపితే కానీ వాహనం ఇవ్వని పరిస్థితి. కానీ, బడాబాబులకు మాత్రం కాసులు కాస్త ఎక్కువగానే తీసుకుని వదిలేస్తున్నారు. తోటి ఉద్యోగులు సైతం తమకు సంబంధించిన వారి వాహనం పట్టుకున్నారని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే మూడో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లోని ఆ ఇద్దరు కానిస్టేబుళ్లతో మాట్లాడుకోమని చెబుతున్నారు.

వారిద్దరు ఎవరు..?

రెండు నెలలుగా మూడో ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. ఉన్నతాధికారులకు తెలిసే ఇదంతా జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. కానీ, రోజుకు రెండు, మూడు వాహనాలను ఇలా అడ్డదారిలో కేసు లేకుండా పంపించేస్తున్నారని, రూ.వేలల్లో డబ్బు దండుకుంటున్నారని స్టేషన్‌ మొత్తం కోడై కూస్తోంది. ఉన్నతాధికారులకు వాటాలు అందుతున్నాయనే ఆరోపణలూ లేకపోలేదు.

బడాబాబులే టార్గెట్‌

ఆ ఇద్దరు కానిస్టేబుళ్లకు బడాబాబులే టార్గెట్‌. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జరిమానా విధించడంతో పాటు జైలుశిక్ష వేస్తుండటంతో.. వాటి నుంచి బయటపడటానికి బడాబాబులు ఎంత ఇవ్వడానికైనా వెనుకాడటం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఒక్కొక్కరి నుంచి అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా రెండు నెలలుగా లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా వసూలైన డబ్బును సదరు కానిస్టేబుళ్లు డైరెక్టుగా తీసుకోకుండా, తమ భార్యల ఫోన్‌పే, గూగుల్‌ పే నెంబర్లకు పంపించేలా చూసుకుంటున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 01:11 AM

Advertising
Advertising