లాయరే అయినా.. క్రిమినల్ మైండ్
ABN, Publish Date - Nov 17 , 2024 | 01:11 AM
పూనూరు గౌతంరెడ్డి.. అందరికీ తెలిసి ఆయన వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు, ఫైబర్‌నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. న్యాయవాది కూడా అయినా.. ఎవరికీ తెలియని క్రిమినల్ ఆలోచనలు చేయడంలో ఆయన దిట్ట. ఆది నుంచి నేరస్వభావం కలిగిన గౌతంరెడ్డి సత్యనారాయణపురంలోని గండూరి ఉమామహేశ్వరశాస్ర్తిపై హత్యాయత్న పన్నాగంలో ఎన్నో క్రిమినల్ స్కెచ్‌లు వేశాడు. పోలీసులు తన జోలికి వెళ్లకుండా న్యాయవాదులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
హత్యాయత్నం కేసులో గౌతంరెడ్డి క్రైమ్ గేమ్
బీబీఏ న్యాయవాదులను పావులుగా చేసి కుట్ర
ఈనెల 6న ఉమామహేశ్వరశాసి్త్రపై హత్యాయత్నం
పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని 7న బీబీఏకు లేఖ
‘ఐక్యం’ పేరుతో న్యాయవాదులను రెచ్చగొట్టే యత్నం
దాడి నిర్ధారణతో పరార్
విజయవాడ, ఆంధ్రజ్యోతి : పూనూరు గౌతంరెడ్డి.. అందరికీ తెలిసి ఆయన వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు, ఫైబర్‌నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. న్యాయవాది కూడా అయినా.. ఎవరికీ తెలియని క్రిమినల్ ఆలోచనలు చేయడంలో ఆయన దిట్ట. ఆది నుంచి నేరస్వభావం కలిగిన గౌతంరెడ్డి సత్యనారాయణపురంలోని గండూరి ఉమామహేశ్వరశాస్ర్తిపై హత్యాయత్న పన్నాగంలో ఎన్నో క్రిమినల్ స్కెచ్‌లు వేశాడు. పోలీసులు తన జోలికి వెళ్లకుండా న్యాయవాదులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
బీబీఏకు లేఖ
జూనియర్ న్యాయవాది పృథ్వీరాజ్, చిల్లకల్లుకు చెందిన అనిల్ కనుసన్నల్లోని సుపారీ గ్యాంగ్ ఈనెల 6న ఉమామహేశ్వరశాస్ర్తిపై దాడి చేసింది. బాధితుడి ఫిర్యాదుతో సత్యనారాయణపురం పోలీసులు రంగప్రవేశం చేశారు. పట్టపగలు నిందితులు ఉమామహేశ్వరశాస్ర్తి ఇంటి ప్రహరీ దాటడం సీసీ కెమెరాల్లో కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్న విషయం గౌతంరెడ్డి చెవిన పడింది. ఈ సమయంలోనే తన క్రిమినల్ బుర్రకు పదును పెట్టాడు. బెజవాడ బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా నమోదైన గౌతంరెడ్డి సహచర న్యాయవాదులను రెచ్చగొట్టి రోడ్డుపైకి తీసుకొచ్చే స్కెచ్ వేశాడు. ఆయన వద్ద జూనియర్‌గా ఉన్న సాయిరాం అనే న్యాయవాదితో బీబీఏకు ఈనెల 7న లేఖ రాయించాడు. ఉమామహేశ్వరశాస్ర్తిపై జరిగిన దాడితో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ పోలీసులు దర్యాప్తు పేరుతో హై హ్యాండిల్ చేస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు. ఒక న్యాయవాది విషయంలో పోలీసులు పరిమితులు దాటి వ్యవహరిస్తున్నారని వివరించాడు. న్యాయవాదులంతా అండగా నిలవాలని పిలుపునిచ్చాడు. ఈ లేఖను ఆ మర్నాడు బీబీఏకు అందజేశాడు. ఉమామహేశ్వరశాస్ర్తిపై జరిగిన దాడి విషయం ఈనెల 12వ తేదీన మీడియాకు తెలిసింది. గౌతంరెడ్డి మాత్రం దాడి జరిగిన వెంటనే లేఖ రాయించి న్యాయవాదుల మద్దతును కూడగట్టుకుని రాద్ధాంతం చేయాలని భావించాడు. ఇలా చేయడం వల్ల పోలీసులు తన వద్దకు రాలేరని భావించాడు. సీసీ కెమెరాల్లో కనిపించిన నిందితుల కోసం వేటాడిన పోలీసులు వారు ఇచ్చిన వాంగ్మూలంతో గౌతంరెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చారు.
తప్పించుకోవాలనుకుని..
గౌతంరెడ్డి ఒకలా ఆలోచిస్తే విధి మరోలా వ్యవహరించింది. ఉమామహేశ్వరశాస్ర్తి ఆయనపై తరచూ పోలీసులకు ఫిర్యాదు చేస్తుండేవాడు. ఆ ఫిర్యాదులను తీసుకున్న పోలీసులు వాటిని పరిశీలించి న్యాయపరమైన కారణాలతో పక్కన పెట్టేవారు. ఎప్పుడూ ఏదో ఒక ఫిర్యాదు చేస్తాడన్న భావన అతడిపై పోలీసులకు ఏర్పడింది. దీన్ని గౌతంరెడ్డి ఓ అవకాశంగా తీసుకున్నాడు. గౌతంరెడ్డి న్యాయవాది అయినా.. ఎన్నడూ కోర్టు మెట్లు ఎక్కలేదు. కొంతమంది జూనియర్లను పెట్టుకుని సెటిల్‌మెంట్ వ్యవహారాలను చక్కబెడుతుండేవాడు. ఉమామహేశ్వరశాస్ర్తి వ్యవహారం తలనొప్పిగా మారుతుండటంతో అతడి హత్యకు కుట్ర పన్నాడు. ఆ తర్వాత న్యాయవాదులను పావులకు వాడుకోవాలనుకుని బోర్లా పడ్డాడు.
Updated Date - Nov 17 , 2024 | 01:11 AM