ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ముడి చమురే మసి చేసింది..!

ABN, Publish Date - Mar 27 , 2024 | 01:37 AM

దేశంలోనే అతిపెద్ద ఆటోనగర్‌గా పేరొందిన ఆటోనగర్‌లో భద్రతకు గ్యారెంటీ ఉందా? విజయవాడ నుంచి కానూరులో ఉన్న కొత్త ఆటోనగర్‌ వరకు ఉన్న గ్యారేజీలు, వర్క్‌షాపుల్లో కార్మికుల ముందు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా? విస్తరించిన కొత్త ఆటోనగర్‌లో అనుమతులతో సంబంధం లేకుండా రీసైక్లింగ్‌ యూనిట్లు వెలుస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

కొత్త ఆటోనగర్‌ క్రూడ్‌ ఆయిల్‌ కంపెనీలో అగ్నిప్రమాదం

రీసైక్లింగ్‌ చేస్తుండగా షార్ట్‌ సర్క్యూట్‌.. ఎగసిన మంటలు

నిమిషాల్లో కంపెనీ మొత్తం బుగ్గిపాలు

5 గంటలు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌

కంపెనీకి అనుమతి లేదు : అగ్నిమాపక శాఖ

విజయవాడ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : కొత్త ఆటోనగర్‌లోని క్రూడ్‌ ఆయిల్‌ రీ సైక్లింగ్‌ కంపెనీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీలోని బాయిలర్లు పనిచేయడం మొదలుపెట్టిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. పెనమలూరు మండలం కానూరులోని కొత్త ఆటోనగర్‌లో శ్రీనివాసరావు అనే వ్యక్తి వాహనాల్లో వాడేసిన ఇంజన్‌ ఆయిల్‌ను కొనుగోలు చేస్తుంటాడు. దీన్ని రీసైక్లింగ్‌ చేసి మార్కెట్లో విక్రయించడానికి బాయిలర్లను ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తం నాలుగు బాయిలర్లలో శుద్ధి చేసిన ఆయిల్‌ను ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో నింపి డీలర్లకు సరఫరా చేస్తుంటాడు. ఆయిల్‌ రీసైక్లింగ్‌ అయ్యాక దానిలో శుద్ధి శాతాన్ని తెలుసుకునేందుకు శాంపిల్స్‌ తీస్తుంటారు. మంగవారం ఉదయం శాంపిల్స్‌ తీస్తుండగా, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఆయిల్‌ పరిశ్రమ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి మొత్తం పరిశ్రమకు వ్యాపించాయి. ఈ ఘటనలో బాయిలర్లు పూర్తిగా కాలిపోయాయి. ఆటోనగర్‌, ఉయ్యూరు, గన్నవరం, కొత్తపేట అగ్నిమాపక కేంద్రాల నుంచి ఐదు వాహనాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన శాఖల అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. మంటలను అదుపు చేసే ఆపరేషన్‌ దాదాపు ఐదు గంటలపాటు సాగింది.

ఐలా.. పర్యవేక్షణ డీలా..

కొత్త ఆటోనగర్‌పై కొరవడిన నిఘా

ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న కంపెనీలు

అనుమతులు లేకుండానే నిర్వహణ

వసూళ్లలో ముగిపోతున్న ‘ఐలా’

ఎక్కడా కనిపించన ఫైర్‌ సేఫ్టీ

విజయవాడ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : ఒకప్పుడు నగరం నుంచి కొత్త ఆటోనగర్‌ వరకు ఒకే క్లస్టర్‌ ఉండేది. జిల్లాల విభజన జరిగాక ఆటోనగర్‌లూ వేరయ్యాయి. ఆటోనగర్‌లో వెలిసే గ్యారేజీలు, వర్క్‌షాపులపై పర్యవేక్షణ, అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు ఐలా (ఇండస్ట్రియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ) ఉంటుంది. దీనికి పాలకవర్గాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఐలాలు అచేతన స్థితిలోకి వెళ్లిపోయాయి. ఆటోనగర్‌లో ఎలాంటి వర్క్‌షాపులు, గ్యారేజీలు కొత్తగా వస్తున్నాయో తెలియడం లేదు. కొత్తగా వస్తున్న రీసైక్లింగ్‌ యూనిట్ల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆటోనగర్‌లో వర్క్‌షాపులు, యూనిట్లపై పర్యవేక్షణ ఉంచాల్సిన ఐలాలు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నాయి. ఇక్కడ ఏ యూనిట్‌ ఏర్పాటవుతుందో తెలుసుకోలేని దుస్థితిలో పనిచేస్తున్నాయి. ఐలాలో ఉన్నవారు పదవులను అడ్డుపెట్టుకుని లక్షలాది రూపాయలను వెనుకేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జవహర్‌ ఆటోనగర్‌, జేఆర్డీ టాటా ఆటోనగర్‌, కొత్త ఆటోనగర్‌. ఈ మూడింటిలో జవహర్‌ ఆటోనగర్‌కు ఉన్న ఐలా పాలకవర్గ కాలపరిమితి కొద్దినెలల క్రితం ముగిసింది. జేఆర్డీ టాటా ఆటోనగర్‌కు ఐలా పాలకవర్గం ఉంది. కొత్త ఆటోనగర్‌కు ఇంకా ఏర్పాటు కాలేదు. వీటంతటికీ కలిపి ఒక కార్యవర్గం కనుసన్నల్లో ఆటోనగర్‌లోని అన్ని కార్యకలాపాలు సాగుతున్నాయి. జవహర్‌ ఆటోనగర్‌లో ఆయిల్‌ రీసైక్లింగ్‌ యూనిట్లు ఉండేవి. వాటి కారణంగా ప్రమాదం పొంచి ఉందని తీయించేశారు. ఇప్పుడు ఈ రీసైక్లింగ్‌ యూనిట్లు కొత్త ఆటోనగర్‌ కేంద్రంగా ఏర్పాటవుతున్నాయి.

అనుమతులు ఉంటున్నాయా?

ఆటోనగర్‌లో ఏర్పాటైన వర్క్‌షాపులు, రీసైక్లింగ్‌ యూనిట్లలో భద్రత ఎంతవరకు ఉందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొత్త ఆటోనగర్‌లోని క్రూడ్‌ ఆయిల్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో ఈ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. లోగడ ఇదే ప్రాంతంలో పాత ప్లాస్టిక్‌ వస్తువులు రీసైక్లింగ్‌ యూనిట్‌లో భారీ ప్రమాదం జరిగింది. తాజాగా క్రూడ్‌ ఆయిల్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌లో జరిగింది. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌ చేసిన అగ్నిమాపక శాఖ అధికారులు.. ఈ యూనిట్‌కు ఎలాంటి అనుమతులు లేవని ప్రకటించారు. ఇలాగే చాలా యూనిట్లు అనుమతులు తీసుకోకుండా కార్యకలాపాలు సాగిస్తున్నాయని బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. తనిఖీలకు వెళ్లినప్పుడు అధికారులను ముడుపులతో ప్రసన్నం చేసుకుంటున్నారు.

అడ్డదిడ్డంగా వాహనాలు

ఆటోనగర్‌లో రిపేర్ల కోసం భారీ వాహనాలు వస్తుంటాయి. కొన్ని వాహనాలు ఉపయోగంలో లేకపోవడంతో పక్కన పడి ఉంటాయి. ఈ వర్క్‌షాపులకు వచ్చే వాహనాలను లోపల ప్రాంగణంలో కాకుండా నడిరోడ్డుపై నిలుపుతున్నారు. స్ర్కాబ్‌ను రహదారుల పక్కన పడేస్తున్నారు. రాత్రివేళ వీటిని ఢీకొని ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆరు నెలల కాలంలో ఇలాంటి ఘటనలు పదుల సంఖ్యలో జరిగాయి.

Updated Date - Mar 27 , 2024 | 01:37 AM

Advertising
Advertising