ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:55 AM

దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిం చాలని రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల సంతకాల సేకరణ చేపట్టనున్నామని ఎన్‌ఎఫ్‌డీసీ జాతీయ చైర్మన్‌ ఇందుపల్లి ఆనందకుమార్‌ అన్నారు.

10 లక్షల సంతకాలు సేకరిస్తాం

కేజీ బాలకృష్ణన్‌ కమిషన్‌కు అందిస్తాం

ఎన్‌ఎఫ్‌డీసీ జాతీయ చైర్మన్‌ ఇందుపల్లి ఆనందకుమార్‌

గుడివాడ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిం చాలని రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల సంతకాల సేకరణ చేపట్టనున్నామని ఎన్‌ఎఫ్‌డీసీ జాతీయ చైర్మన్‌ ఇందుపల్లి ఆనందకుమార్‌ అన్నారు. సోమవారం నాగవరప్పాడులోని రివైల్‌ పెంతకోస్తు చర్చిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మతం తీసుకుంటే కులం మారదన్నారు. దళితులు ఎన్నో పోరాటాలు చేయడం వల్లే కేంద్ర ప్రభుత్వం కేజీ బాలకృష్ణన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. కమిషన్‌ త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తుందని తెలిపారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని 10లక్షల సంతకాలను సేకరించి బాలకృష్ణన్‌ కమిషన్‌కు అందజేయాలని నిర్ణయించా మన్నారు. జాతీయ కోశాధికారి బిషప్‌ కె.శాంతిసాగర్‌, సంయుక్త కార్యదర్శి కొదమల ఎలీజా, సభ్యులు పి.వరప్రసాద్‌, జి.శ్యామ్‌బాబు, పాస్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 12:58 AM