Pawankalyan: బాబును ఎన్నిసార్లు మెచ్చుకున్నా తక్కువే
ABN, Publish Date - Dec 13 , 2024 | 01:33 PM
Andhrapradesh: ‘‘నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచే జరగాలి’’ అని అన్నారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారధ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విజన్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కోట్లాది మంది కలలను సాకారం చేసే మహాసంకల్పమన్నారు.
అమరావతి, డిసెంబర్ 13: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (CM Chandrababu Naidu) మరోసారి పొగడ్తలతో ముంచెత్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan). స్వర్ణాంధ్ర విజన్-2047 ఆవిష్కరణ వేదికగా సీఎంపై పవన్ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం దగ్గర పనిచేయడం ఎంతో గర్నంగా ఉందని చెప్పుకొచ్చారు. సైబరాబాద్ రూపకర్త, శిల్పి, చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబే అంటూ పవన్ కొనియాడారు.
పెద్ద కేసులే పెట్టారుగా.. ఎన్నేళ్ల జైలు శిక్ష పడనుందంటే..
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్-2047 ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. ‘‘నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచే జరగాలి’’ అని అన్నారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారధ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని ఉపముఖ్యమంత్రి అన్నారు. విజన్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కోట్లాది మంది కలలను సాకారం చేసే మహాసంకల్పమన్నారు. పార్టీ పెట్టి తాను నలిగిన తర్వాతే చంద్రబాబు విలువేంటో మరింత తెలిసి ఆయనపై అపార గౌరవం పెరిగిందని చెప్పుకొచ్చారు. పార్టీ నడపటం అంటే ఆత్మహత్యా సద్రుశ్యంతో సమానమన్నారు. ప్రతీ ఒక్కరికీ దిక్సూచీ అవసరమన్నారు. విజన్ 2020 నాడు తన స్థాయికి అర్థం కాలేదని తెలిపారు.
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు.. వీడియో చూడండి..
చంద్రబాబు ఆయన కోసం కలలు కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్న మహానాయకుడని విజన్ 2020 ఫలితాల ద్వారా అర్థమైందన్నారు. నాడు రాళ్లు రప్పలు చూసిన ప్రాంతంలో చంద్రబాబు సైబర్ సిటీ మహానగరాన్ని చూశారన్నారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సైబరాబాద్ రూపకర్త, శిల్పి, చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబే అంటూ కొనియాడారు. ఎంతో కష్టపడి కట్టిన ట్విన్ టవర్స్‌ను ఉగ్రవాదులు ఒక పూటలోనే కూల్చేశారని.. నిర్మాణం విలువ తెలియని గత పాలకులూ ఇదే మాదిరి వ్యవహరించారన్నారు. ‘‘చంద్రబాబు ఓపికను ఎన్నిసార్లు మెచ్చుకున్నా సరిపోదు, మేం మా కోసం కలలు కంటే ఆయన ప్రజల కోసం కలలు కంటున్నారు. అలాంటి అనుభవజ్ఞుడి వద్ద పనిచేయటం ఎంతో గర్వంగా ఉంది’’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఉన్నతాధికారులకు పవన్ హితబోధ
ప్రజలకు పాలకులకు మధ్య ఉన్నతాధికారులు అనుసంధానకర్తలు అని పవన్ అన్నారు. గత ఐయిదేళ్లలో ఒక్క ఉన్నతాధికారైనా గట్టిగా చెప్పి ఉంటే ఈనాడు ఇన్ని వారసత్వ సమస్యలు వచ్చి ఉండేవి కాదన్నారు. ఎంతో అనుభవంతో ముఖ్యమంత్రి రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను సమర్థంగా అమలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదే అని వెల్లడించారు. దయచేసి గత ప్రభుత్వంలా భయపడుతూ రాజీపడొద్దని తెలిపారు. ప్రజలు కూడా తమ శక్తిని తాము తెలుసుకుని ఎన్నికల్లో గట్టి తీర్పు చెప్పారన్నారు. ప్రజా భాగస్వామ్యంతోనే అధికారులతో గట్టిగా పనిచేయించగలమని అన్నారు. ఎన్నికలప్పుడు కనబరిచిన బాధ్యతను ప్రజలు కొనసాగించాలని పవన్ అన్నారు.
కాగా.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో స్వర్ణాంధ్ర @ 2047ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అలాగే కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25 వేల మంది హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
భయంతో పేర్ని ఫ్యామిలీ పరార్..!
జగన్ అక్రమాస్తుల కేసు... తాజా అప్‌డేట్ ఇదే
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 13 , 2024 | 01:45 PM