ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేటలో డయేరియా పంజా!

ABN, Publish Date - Jun 22 , 2024 | 12:26 AM

జగ్గయ్యపేట నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో డయేరియా కలకలం రేపుతోంది. పట్టణంతో పాటు వత్సవాయి మండలం మక్కపేట, వత్సవాయి, కాకరవాయి, షేర్‌మహ్మద్‌పేట, గండ్రాయి, వేదాద్రి గ్రామాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. బక్రీద్‌ పండుగ తర్వాత గ్రామాల్లో కేసులు ఉధృతమైనట్టు వైద్యవర్గాలు చెబుతున్నాయి.

  • ఆర్‌ఎంపీలు, పీఎంపీల వద్ద వైద్యం

  • విషమిస్తే జగ్గయ్యపేట ఆసుపత్రికి

  • అధికారికంగా 40 మందికి లక్షణాలు

  • వ్యాధిగ్రస్తులను పరామర్శించిన తాతయ్య

  • డీఎంహెచ్‌వో, కలెక్టర్‌ ఆస్పత్రుల సందర్శన

జగ్గయ్యపేట, జూన్‌ 21 : జగ్గయ్యపేట నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో డయేరియా కలకలం రేపుతోంది. పట్టణంతో పాటు వత్సవాయి మండలం మక్కపేట, వత్సవాయి, కాకరవాయి, షేర్‌మహ్మద్‌పేట, గండ్రాయి, వేదాద్రి గ్రామాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. బక్రీద్‌ పండుగ తర్వాత గ్రామాల్లో కేసులు ఉధృతమైనట్టు వైద్యవర్గాలు చెబుతున్నాయి. శాంతినగర్‌కు చెందిన సత్యనారాయణ (38), చిల్లకల్లుకు చెందిన వెంకటేశ్వరరావు (75) వాంతులు, విరేచనాలతో పాటు హృద్రోగ సమస్యలు ఉండటంతో గురువారం మృతి చెందటంతో వైద్యవర్గాలు ఆలర్ట్‌ అయ్యారు. జగ్గయ్యపేట ఆరోగ్య కేంద్రంలో ఇప్పటివరకు 41 కేసులు నమోదు కాగా, 30 మంది కోలుకోని ఇళ్లకు వెళ్లిపోయినట్టుచెబుతున్నారు. సీహెచ్‌సీతో పాటు పట్టణంలో ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో పలువురు చికిత్స పొందుతున్నారు. మక్కపేటలో కేసుల సంఖ్య అధికంగా ఉంది. ఒకే ఇంట్లో తల్లికూతుళ్లు, మనవరాలు తురకా మంగతాయయ్మ (60) యండ్రాతి మరియమ్మ (40) కీర్తి (15), జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామానికి చెందిన గుగ్లోత్‌ జమ్మా (60)లు శుక్రవారం వాంతులు, విరేచనాలతో జగ్గయ్యపేట ఆసుపత్రిలో చేరారు. డాంగేనగర్‌కు చెందిన ఉమ్మినేని రంగయ్య (60), మరియమ్మ (60)ల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని విజయవాడ రిఫర్‌ చేశారు. వేదాద్రికి చెందిన పసుమర్తి సత్యవతి (65) మక్కపేటలో ఉన్న సోదరి ఇంటికి వెళ్లి వాంతులు విరేచనాలు కావటంతో జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో వైవై కాలనికి చెందిన మాదాల రక్షిత (24), మేడా విజ యలక్ష్మీ (20)లు రెండు రోజులగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వత్సవాయి మండలం కాకరవాయికి చెంది న తొట్టెంపుడి దివ్యశ్రీ (12), మక్కపేటకు చెందిన ధారావత్‌ గౌతమి(11), వత్సవాయికి చెందిన నల్లబోతుల నందిని (17)లు మూడురోజులగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ హరీష్‌ చెప్పారు. పట్టణంలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో 12 మంది చికిత్స పొందుతున్నారని డీఎంహెచ్‌ఓ సుహాసిని తెలిపారు.

రాత్రికి రాత్రే డీఎంహెచ్‌ఓ, తాతయ్య ఆసుపత్రి సందర్శన..

డయేరియా లక్షణాలతో యువకుడు, వృద్ధుడు మృతి చెందినట్టు వార్తలు రావటంతో గురువారం రాత్రి ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య హూటాహుటిన ఆసుపత్రిని సందర్శించారు. విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన వెంటనే డీఎంహెచ్‌ఓను జగ్గయ్యపేట వెళ్లాలని ఆదేశించడంతో ఆమె వచ్చి సమీక్షించారు. షేర్‌మహ్మద్‌పేటకు చెందిన షేక్‌ రేష్మా, నాగమణిలను విజయవాడ జీజీహెచ్‌, ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. మంత్రి ఆదేశాలతో గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. గ్రామంలో నీటి కాలుష్యం అధికంగా ఉందని చెప్పటంతో గ్రామాన్ని సందర్శించారు.

బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్‌

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యతో కలిసి ఆసుపత్రిలో రోగులను పరామర్శించారు. షేర్‌ మహ్మద్‌పేటలో తాగునీటి శాంపిల్స్‌ పరీక్షలకు పంపాలని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వాతావరణంలో మార్పులు, నీరు మారటం వల్ల డయేరియా లక్షణాలు కనిపిస్తున్నాయని కలెక్టర్‌ అన్నారు. ఎవరికి లక్షణాలు కనిపించినా ఆసుపత్రికి రావాలని ఆయన కోరారు. జిల్లా అధికారులు డయేరియా మృతిని నిర్ధారించటం లేదు.

చర్యలకు ఉపక్రమించిన మునిసిపాలిటి..

జగ్గయ్యపేట పట్టణంలో డయేరియా లక్షణాలు కనిపించటంతో మునిసిపల్‌ అధికారులు, చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర తక్షణచర్యలకు ఉపక్రమించారు. రక్షిత మంచినీటి పథకం ట్యాంకులను శుభ్రం చేయించారు. చైర్మన్‌ వాటర్‌ వర్క్స్‌ను సందర్శించి, క్లోరినేషన్‌, ఫిల్టరేషన్‌లను పరి శీలించారు. ఎక్కడ వాటర్‌ లీకేజిలు ఉన్న యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన కమిషనర్‌ మల్లేశ్వరరావుకు సూచించారు.

అతిసారపై అప్రమత్తంకండి..

సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల కలెక్టర్లు..

అధికారులకు సత్వర ఆదేశాలు

విజయవాడ లీగల్‌ : జిల్లాలో అతిసార వ్యాప్తి చెందకుండా క్షేత్రస్థాయిలో పగడ్బందీ చర్యలు చేపట్టాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ డయేరియాపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో కలెక్టర్‌ హాజరయ్యారు. అతిసార కేసులు నమోదు కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్‌ మార్గనిర్దేశనం చేశారు. అదేవిధంగా జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమంపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ జిల్లా వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్‌ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. పటిష్ట ప్రణాళిక ప్రకారం జిల్లాలో అతిసారం వ్యాప్తి చెందకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. డయేరియాపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సురక్షిత తాగునీరు, చేతుల పరిశుభ్రత తదితరాలపై అవగాహన కల్పించాలన్నారు. తాగునీరు సరఫరా, పారిశుధ్య కార్యక్రమాల అమలుపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కేసులు నమోదైన చోట మూలాలను గుర్తించి సత్వరం పరిస్థితిని చక్కదిద్దాలని స్పష్టం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఓఆర్‌ఎస్‌, జింక్‌ ప్యాకెట్‌ల పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఆరోగ్యశాఖ అధికారుల భాగస్వామ్యంతో ఐసీడీఎస్‌ అధికారులు అంగన్వాడీ కేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, జింక్‌ కార్నర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలని, అవసరం మేరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిరంతర వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో వుండాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

మచిలీపట్నం (ఆంధ్రజ్యోతి) : వర్షాకాలంలో డయేరియా కేసులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. తాగునీటి పైప్‌లైన్‌ల లీకేజీలను నియంత్రించాలన్నారు. తాగునీటి చెరువులు, ట్యాంకులను తరచూ క్లోరినేషన్‌ చేయాలన్నారు. వర్షాకాలంలో సురక్షిత తాగునీటిని ప్రజలు ఉపయోగించేలా అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లతో ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌వో గీతాబాయి, ఐసీడీఎస్‌ పీడీ ఎన్‌.సువర్ణ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2024 | 12:26 AM

Advertising
Advertising