డిజిటల్ అరెస్ట్..బీ అలెర్ట్
ABN, Publish Date - Nov 12 , 2024 | 01:32 AM
పటమటలంకకు చెందిన ఓ వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. ‘మీ ఫోన్ నెంబర్ నుంచి అనేక మందికి వేధింపులు జరుగుతున్నాయి. దీనిపై అంథేరి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.’ అని చెప్పాడు. దీనికి ఇవతలి వ్యక్తి కంగారు పడ్డాడు. ఇంగ్లీష్‌పై పట్టున్న ఈయన తాను ఎలాంటి వేధింపులు చేయలేదని చెప్పాడు. ఎఫ్‌ఐఆర్ నెంబర్లు చెప్పాలని అడిగాడు. లైన్‌లో ఉంటే పోలీసులకు కలుపుతామని చెప్పి ఆ ఫోన్‌ను మరొకరికి కలిపాడు. కేసులు నమోదయ్యాయని చెబుతూ ఎఫ్‌ఐఆర్ నెంబర్లు తెలిపాడు. వెంటనే మళ్లీ ముందుగా ఫోన్లో మాట్లాడిన వ్యక్తి కేసు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చాడు. తాము చెప్పినట్టు చేయకపోతే సిమ్ బ్లాక్ అయిపోతుందని బెదిరించాడు. ఇక్కడి వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తానని చెప్పడంతో అవతలి వ్యక్తి వెంటనే ఫోన్ కట్ చేశాడు. మళ్లీ ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఇది తాజాగా జరిగిన ఘటన. తక్కువ పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని తెలియజేసే వీడియో లింక్ సూర్యారావుపేటలో ఉంటున్న ఒక వ్యక్తి ఫోన్‌కు వచ్చింది. ఆ వ్యక్తి వెంటనే సైబర్ క్రైం పోలీసుల వద్దకు వెళ్లాడు. వచ్చిన వీడియోను పోలీసులకు చూపించాడు. ఇదంతా ఒక మోసమని చెప్పిన పోలీసులు అతనికి ఓ అవగాహన కల్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత కొద్దిరోజులకు ఆయన ఫోన్‌కు వాట్సాప్‌లో ఒక నోటీసు వచ్చింది. కాసేపటికి వీడియో కాల్ వచ్చింది. విదేశాలకు పంపే పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని, ముంబై పోలీసులు పట్టుకున్నారని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఎలాంటి విచారణ లేకుండా ఉండాలంటే తాను చెప్పినట్టు చేయాలన్నాడు. అతను చెప్పినట్టు డబ్బు పంపాడు. ఈవిధంగా రూ.10 లక్షల వరకు కోల్పోయాడు. ఒక కేసులో త్రుటిలో తప్పించుకున్న ఆయన డిజిటల్ అరెస్టులో మాత్రం ఇరుక్కుపోయాడు. ఇన్నాళ్లూ వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లతో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు... ఇప్పుడు డిజిటల్ అరెస్టులపై పడ్డారు. కేసులు, నోటీసుల పేరుచెప్పి రూ.లక్షల్లో కాజేస్తున్న ఘటనలు ఇప్పుడు నగరంలో ఎక్కువగా జరుగుతున్నాయి.
నగరంలో పెరుగుతున్న సైబర్ కేసులు
కేసులు, అరెస్టుల పేరుతో ఫోన్లు
భయాలు, బెదిరింపులతో హడావిడి
పటమటలంకకు చెందిన ఓ వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. ‘మీ ఫోన్ నెంబర్ నుంచి అనేక మందికి వేధింపులు జరుగుతున్నాయి. దీనిపై అంథేరి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.’ అని చెప్పాడు. దీనికి ఇవతలి వ్యక్తి కంగారు పడ్డాడు. ఇంగ్లీష్‌పై పట్టున్న ఈయన తాను ఎలాంటి వేధింపులు చేయలేదని చెప్పాడు. ఎఫ్‌ఐఆర్ నెంబర్లు చెప్పాలని అడిగాడు. లైన్‌లో ఉంటే పోలీసులకు కలుపుతామని చెప్పి ఆ ఫోన్‌ను మరొకరికి కలిపాడు. కేసులు నమోదయ్యాయని చెబుతూ ఎఫ్‌ఐఆర్ నెంబర్లు తెలిపాడు. వెంటనే మళ్లీ ముందుగా ఫోన్లో మాట్లాడిన వ్యక్తి కేసు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చాడు. తాము చెప్పినట్టు చేయకపోతే సిమ్ బ్లాక్ అయిపోతుందని బెదిరించాడు. ఇక్కడి వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తానని చెప్పడంతో అవతలి వ్యక్తి వెంటనే ఫోన్ కట్ చేశాడు. మళ్లీ ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఇది తాజాగా జరిగిన ఘటన.
తక్కువ పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని తెలియజేసే వీడియో లింక్ సూర్యారావుపేటలో ఉంటున్న ఒక వ్యక్తి ఫోన్‌కు వచ్చింది. ఆ వ్యక్తి వెంటనే సైబర్ క్రైం పోలీసుల వద్దకు వెళ్లాడు. వచ్చిన వీడియోను పోలీసులకు చూపించాడు. ఇదంతా ఒక మోసమని చెప్పిన పోలీసులు అతనికి ఓ అవగాహన కల్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత కొద్దిరోజులకు ఆయన ఫోన్‌కు వాట్సాప్‌లో ఒక నోటీసు వచ్చింది. కాసేపటికి వీడియో కాల్ వచ్చింది. విదేశాలకు పంపే పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని, ముంబై పోలీసులు పట్టుకున్నారని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఎలాంటి విచారణ లేకుండా ఉండాలంటే తాను చెప్పినట్టు చేయాలన్నాడు. అతను చెప్పినట్టు డబ్బు పంపాడు. ఈవిధంగా రూ.10 లక్షల వరకు కోల్పోయాడు. ఒక కేసులో త్రుటిలో తప్పించుకున్న ఆయన డిజిటల్ అరెస్టులో మాత్రం ఇరుక్కుపోయాడు. ఇన్నాళ్లూ వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లతో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు... ఇప్పుడు డిజిటల్ అరెస్టులపై పడ్డారు. కేసులు, నోటీసుల పేరుచెప్పి రూ.లక్షల్లో కాజేస్తున్న ఘటనలు ఇప్పుడు నగరంలో ఎక్కువగా జరుగుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఒకప్పుడు ఓటీపీ (వన్‌టైం పాస్‌వర్డ్) నేరాలు ప్రజలను నట్టేట ముంచాయి. వాటిపై పూర్తి అవగాహన వచ్చాక ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులతో ముంచడానికి సిద్ధమయ్యారు. వేర్వేరు నెంబర్లతో ఫోన్లు చేస్తూ డిజిటల్ అరెస్టుల పదాలను ఉపయోగిస్తున్నారు. కేసులు, నోటీసుల గురించి చెప్పి భయపెడుతున్నారు. ట్రాప్‌లో పడిన వారి నుంచి లక్షల రూపాయలు లాగేస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం ఉత్తరాది రాష్ట్రాల నుంచి జరుగుతున్నాయి. మరికొంతమంది విదేశాల నుంచి ఈ నేరాలను నడిపిస్తున్నారు.
నగరంలో బాధితులు 82 మంది
సైబర్ నేరాల్లో ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్, డిజిటల్ అరెస్టులు టాప్‌లో ఉంటున్నాయి. సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌కు వస్తున్న బాధితుల్లో ఎక్కువ మంది ఈ రెండింటిలో బాధితులుగా ఉంటున్నారు. డిజిటల్ అరెస్టులకు సంబంధించి ఈ ఏడాది నుంచే కేసులు పెరుగుతున్నాయి. పోలీసులు ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదు చేశారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాల పేరుతో జరిగిన మోసాల్లో 82 మంది రూ.లక్షలు కోల్పోయారు. దక్షిణాది వాసులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా యువకులు, మధ్యవయస్కులను లక్ష్యంగా చేసుకుని ఫోన్లు చేస్తున్నారు. టార్గెట్ నెరవేరే వరకు వీడియో కాల్స్ చేస్తూ, వాట్సాప్‌ల్లో నోటీసులు పంపుతూ వేధిస్తున్నారు. వ్యక్తులు ట్రాప్‌లో పడగానే ఆ నెంబర్లను స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. ఇలా వస్తున్న కాల్స్, నోటీసులు నిజమేనని భయపడుతున్నారు.
ఈ అవగాహన ఉంటే..
పోలీసులు గానీ, దర్యాప్తు సంస్థలు గానీ చేసే అరెస్టులకు ఆయా సంస్థల నుంచి సిబ్బంది నేరుగా వస్తారు.
ఒకవేళ కేసు నమోదైతే విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇస్తారు.
అరెస్టు చేయాలనుకున్న అధికారులు వీడియో కాల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు.
నోటీసులను వాట్సాప్‌ల్లో పంపరు. సిబ్బంది స్వయంగా ఇచ్చి అందజేస్తారు.
కేసు నమోదైన తర్వాత దాన్ని తొలగించాలంటే ఆ నేరంలో మన ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించాలి. అటువంటప్పుడే కేసులు తొలగించే అవకాశం ఉంటుంది.
డిజిటల్ అరెస్టుకు చట్టం లేదు
చట్టంలో గానీ, రాజ్యాంగంలో గానీ ఎక్కడా డిజిటల్ అరెస్టు అన్నమాటకు స్థానం లేదు. ఎవరైనా ఏదైనా కేసులో తప్పు చేసినట్టు నిర్ధారణ అయితే పోలీసులు స్వయంగా వెళ్లి అరెస్టు చేస్తారు. తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. ఇది చట్టప్రకారం జరిగే ప్రక్రియ. డిజిటల్ అరెస్టు అన్నది సైబర్ నేరగాళ్లు సృష్టించుకున్న పదం. సైబర్ నేరగాళ్లు వేస్తున్న ఎత్తుల్లో ఇదొకటి. ఎక్కడెక్కడి నుంచో వీడియో కాల్స్, వాటాప్స్ కాల్స్ చేసి ప్రజలను డిజిటల్ అరెస్టుల పేరుతో భయపెడుతున్నారు. దీనికి ప్రజలు ఏమాత్రం బెదరాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఫోన్లు చేసి కేసులు నమోదయ్యాయని, మాఫీ చేస్తామని చెప్తే అది కచ్చితంగా సైబర్ నేరమే. ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే ప్రజలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాలి.
- ఎస్వీ రాజశేఖరబాబు, పోలీసు కమిషనర్
Updated Date - Nov 12 , 2024 | 01:32 AM