ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kalva Srinivasulu: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై సభలో చర్చ

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:44 PM

Andhrapradesh: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశంపై శాసనసభలో చర్చ జరిగింది. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ప్రయత్నం ఎంతో ఆనందించదగ్గ పరిణామం అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైసీపీ వచ్చాక మూడు రాజధానులు పేరుతో కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. రాయలసీమ వాసులను నిలువునా మోసం చేశారు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు.

Former Minister Kalva Srinivasulu

అమరావతి, నవంబర్ 21: ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై శాసనసభలో (AP Assembly) చర్చ జరిగింది. మంత్రి ఎండీఫరూక్‌ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ప్రయత్నం ఎంతో ఆనందించదగ్గ పరిణామమన్నారు. వైసీపీ వచ్చాక మూడు రాజధానులు పేరుతో కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. రాయలసీమ వాసులను నిలువునా మోసం చేశారు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు. అప్పట్లో 22 మంది ఎంపీలు ఉన్నా హైకోర్టు తరలింపుకు ఎలాంటి చర్య చేయలేదన్నారు.

Anitha: గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై హోంమంత్రి ఏం చెప్పారంటే


న్యాయరాజధాని కర్నూలు అని జగన్ అంటారని.. అదే జగన్ ఏపీ జుడిషియల్ అకాడమీని మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నట్టు జీవో ఇచ్చారని తెలిపారు. ఈ నిర్ణయం అత్యంత దుర్మార్గమన్నారు. హమీలకు, ప్రభుత్వ ఉత్తర్వులకు ఆనాడు పొంతన లేదని అన్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టే ఆలోచన ఉందని.. అయితే ఆ ఆలోచన విరమించినట్టు 2022 నవంబర్ 25న సుప్రీంకోర్టుకు తెలిపిందన్నారు. తద్వరా జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలి పోయారని చెప్పారు. ప్రజాగళం యత్రలో ఇచ్చిన హమీ మేరకు నిర్ణయం తీసుకొని కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రాసెస్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. దేశంలో వేరు రాష్ట్రాల్లో 16 బెంచ్‌లు పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర జనాభా 5 కోట్లు అయితే రాయలసీమలో కోటి 50 లక్షలు మంది ఉన్నారని... విస్తీర్ణం 43శాతం ఉందన్నారు. రాయలసీమ బిడ్డగా సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమకు అందిస్తున్న వరంగా హైకోర్టు బెంచ్‌గా చెప్పుకోవాలని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.


ప్రక్రియ షురూ...

కాగా.. కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు కోసం ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా గళంలో ఇచ్చిన హామీ మేరకు హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సర్కార్ పేర్కొంది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి న్యాయశాఖకు వచ్చిన లేఖతో ప్రక్రియను న్యాయశాఖ మొదలుపెట్టింది. బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌కు న్యాయశాఖ కార్యదర్శి సునీత లేఖ రాశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు కర్నూల్, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి హైకోర్ట్‌లో దాఖలైన కేసులు వివరాలు ఇవ్వాలని న్యాయశాఖ కార్యదర్శి కోరారు. బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఈ నాలుగు జిల్లాల నుంచి 1/3 కేసులు ఉండాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర మొత్తం జనాభాలో 4.95 కోట్లు ఉండగా అందులో రాయలసీమలో రీజియన్‌లో 1.59 కోట్ల మంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. అంటే రాష్ట్ర మొత్తం జనాభాలో 25 శాతం మంది ఈ రీజియన్‌లో ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో ఇప్పటికే 7 రాష్ట్రాల్లో హైకోర్ట్ బెంచ్‌లు ఏర్పాటు చేశారని అధికారులు గుర్తుచేశారు. రాయలసీమ రీజియన్ నుంచి నేరుగా రాజధానికి వచ్చేందుకు రవాణా సౌకర్యం కూడా సరిగా లేదని అధికారులు పేర్కొన్నారు. హైకోర్ట్‌లో ఈ రీజియన్ నుంచి వచ్చిన కేసుల్లో రెండు లేదా మూడు ఏళ్ల కంటే పెండింగ్‌లో ఉన్న వివరాలు కూడా ఇవ్వాలని అధికారులు కోరారు. దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌ను న్యాయశాఖ కార్యదర్శి సునీత కోరారు.


ఇవి కూడా చదవండి...

Cyber Fraud ఈ-నేరగాళ్లకు ఝలక్ ఇచ్చిన ఉద్యోగి

షాకింగ్ రూ. 4 వేలు తగ్గిన వెండి.. ఇక బంగారం రేటు

Read latest AP News And Telugu News

Updated Date - Nov 21 , 2024 | 12:44 PM