ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డ్రగ్స్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలి

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:52 AM

డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలు వినియోగం వలన ఏర్పడే దుష్పలితాల పట్ల విద్యార్థులకు, ప్రజలకు అవ గాహన కల్పించి వారిలో చైత న్యం తీసుకువచ్చేందుకు అందరం సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

డ్రగ్స్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలి

ఎమ్మెల్యే సుజనా చౌదరి

లబ్బీపేట, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలు వినియోగం వలన ఏర్పడే దుష్పలితాల పట్ల విద్యార్థులకు, ప్రజలకు అవ గాహన కల్పించి వారిలో చైత న్యం తీసుకువచ్చేందుకు అందరం సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు. బెంజిసర్కిల్‌లోని జ్యోతి కన్వెన్షన్‌ సెంటర్‌లో బుధవారం ఎంజే నాయుడు హాస్పటల్‌ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం జరి గింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడు తూ డ్రగ్స్‌ రహిత సమాజం కోసం అందరం సమష్టిగా కృషి చేయాలన్నారు. వైద్యులంతా మానవతా దృక్పథంతో సమాజసేవలో భాగ స్వాములు కావాలని, వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కైకలూరు ఎమ్యెల్యే కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలు వినియోగానికి వ్యతిరేకంగా చైతన్యం కలిగించేలా ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందిచడం అభినందనీ యమన్నారు. జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్‌ వాడకం వలన సంభవించే అనర్థాలను ప్రచారం చేయడంతో పాటు అవకాశం ఉన్న చోట అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజే నాయుడు హాస్పటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మాధవి, డాక్టర్‌ వంశీ, హాస్పటల్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎంజే నాయుడు, రాధిక రెడ్డి, సిద్ధార్థ మహిళా కళాశాల మాజీ డైరెక్టర్‌ టి.విజయ లక్ష్మి, కార్పొరేటర్‌ అపర్ణ పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:52 AM