ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తీరాన తీరని అలజడి

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:39 AM

రెండు దిక్కుల్లో సముద్రం. మిగిలిన రెండు దిక్కుల్లో కృష్ణానది, నడుమ ఉండే దీవే దివిసీమ. ప్రకృతి వైపరీత్యాలు, ఉప్పెన ముప్పులు, వరదలతో తరచూ ఈ ప్రాం తం తల్లడిల్లిపోతోంది. దివిసీమ ఉప్పెన అనంతరం సముద్రపు అలలు చెలియల కట్టు దాటి గ్రామాలపై పడకుండా రక్షణగా కరకట్టను పటిష్టపర్చి నది ద్వారా లోపలికి వచ్చే నీరు బయటకు పోయేలా, పోటు సమయాల్లో సముద్రపు నీరు లోపలికి రాకుండా అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌లను ప్రభుత్వం నిర్మించింది. వరద నీరు గ్రామా ల్లోకి రాకుండా కృష్ణా కరకట్టను పటిష్ట పరిచింది. 1999లో చంద్రబాబు ప్రభుత్వం కృష్ణా కరకట్టలు పునర్నిర్మించింది. 2004 లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సముద్రపు కరకట్ట ను పునర్నిర్మించింది. కృష్ణా కరకట్టలు కొంతమేర పటిష్టంగా ఉన్నప్పటికీ సము ద్రపు కరకట్టలు తీర ప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళను గురి చేస్తున్నాయి. సముద్రపు కరకట్టల నిర్వహణను ప్రభుత్వాలు పట్టిం చుకోకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం రూ.25 కోట్లతో కరకట్టలను పటిష్టపరుస్తామని ఉత్తుత్తి ప్రకటన చేసింది. రెండేళ్లకు కూడా డీపీఆర్‌లు తయారు చేయలేదు. కరకట్టలు పటిష్టపర్చాలంటూ అప్పుడు మండలి బుద్ధ ప్రసాద్‌ నేతృత్వంలో నాటి ప్రతిపక్ష టీడీపీ కరకట్ట పొడవునా పాదయాత్ర చేసింది. ప్రతిపక్షంలో ఉన్న వారు అధికారంలోకి వచ్చారు. కానీ ఇంతవరకు కరకట్టల ఊసే తీయలేదు. అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ల ద్వారా సముద్రపు నీరు పొలాలను ముంచె త్తుతోంది.

శిథిలావస్థకు చేరిన సముద్రపు కరకట్ట

దివిసీమ ఉప్పెనకు నేటికి 48 ఏళ్లు

ఇప్పటికీ తీరంలో భద్రత ప్రశ్నార్థకమే..

వైపరీత్యాల నుంచి పాఠాలు నేర్వని పాలకులు

విపత్తుల నిర్వహణపై కొరవడిన శ్రద్ధ

యథేచ్ఛగా సాగుతున్న పర్యావరణ విధ్వంసం

వైసీపీ హయాంలో బ్లాక్‌ శాండ్‌ పేరిట దోపిడీ

కరకట్ట సమీపంలో భారీ తవ్వకాలు

పొలాల్లోకి చొచ్చుకొస్తున్న సముద్రపు నీరు

కోతకు గురవుతున్న కృష్ణానది తీరప్రాంతాలు

తీరంలో క్షణక్షణం.. భయంభయం

(ఆంధ్రజ్యోతి-అవనిగడ్డ): దివి ప్రాంతంలో విచ్చలవిడిగా పర్యావరణ విధ్వంసం సాగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాం లో బ్లాక్‌శాండ్‌ పేరుతో సముద్ర చెలియలి కట్ట సమీ పంలో తవ్వకాలు చేపట్టి తీర భద్రతకు సవాల్‌ విసిరారు. సముద్రపు బ్యాక్‌ వాటర్‌ పాయల్లో తవ్వకాలు జరపకూడదని పెట్టిన సీఆర్‌ జడ్‌ నిబంధనలను వైసీపీ హయాంలో తుంగలో తొక్కారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ సీఆర్‌జడ్‌ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతున్నాయి.

చొచ్చుకొస్తున్న సముద్రం

వీటి కారణంగా తీరగ్రామాల్లో కృష్ణానదీ పరివాహక గ్రామాల్లో కోత తీవ్రత ఆందోళనకర స్థాయికి పెరిగిపోయింది. రెండు, మూడు దశాబ్దాలుగా విచ్చలవిడిగా సాగుతున్న పర్యావ రణ విధ్వంసం కారణంగా వాతావరణంలో పెనుమార్పులు సంభవించి, భూతాపం నానాటికీ పెరిగిపోతోంది. అది సముద్రపు తీర గ్రామాల్లో భౌగోళిక పరిస్థితుల్లో మార్పునకు కారణమవుతోంది. కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతాల్లో సముద్రపు మట్టం గణనీయంగా పెరిగి సముద్రం క్రమేణా ముందుకు వస్తోంది. కోడూరు, నాగాయలంక మండలాల్లోని తీర ప్రాంత గ్రామాల్లోని ఐదు వేల ఎకరాల్లో నాలుగున్నరేళ్లుగా ఒక్క పంట కూడా తీసుకోలేకపోయారు. ఈ ఏడాదీ సము ద్రపు నీరు డ్రెయిన్ల ద్వారా పంట పొలాలను ముంచెత్తుతోంది.

విపత్తులు ఎదుర్కొనే సన్నద్ధత ఏదీ..

1977 ఉప్పెన అనంతరం పలు తుఫాన్లు, వరదలు దివి ప్రాంతాన్ని అత లాకుతలం చేసినప్పటికీ సహాయ పునరావాసాలపైనే ప్రభుత్వం దృష్టి పెడుతోంది. నష్ట తీవ్రత తగ్గించేలా చర్యలు చేపట్టడంలో విఫలమవుతూనే ఉంది. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో విపత్తుల నష్ట తగ్గింపు కార్యక్రమం కింద తీర గ్రామాల్లో తుఫాన్‌ షెల్టర్లకు వెళ్లేలా తారు రోడ్లు వేశారు. కానీ షెల్టర్ల గురించి గానీ, మండల కేంద్రాల్లో నుంచి తీర గ్రామాలకు వెళ్లే రహ దారుల గురించి గానీ, అత్యవసర సమయాల్లో వారికి వారే సహాయం చేసుకునేలా తీర గ్రామాల ప్రజలకు శిక్షణ ఇవ్వటంలో గానీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి.

అది కాళరాత్రి..

1977 నవంబరు 19వ తేదీన రాత్రి సంభవించిన దివిసీమ పెను ఉప్పెనకు నేటితో 47 ఏళ్లు పూర్తయ్యాయి. తాడెత్తున ఎగ సిన రాకాసి అలలు గ్రామాలపై విరుచుకుపడి కృష్ణాజిల్లా నాగా యలంక, కోడూరు మండలాతోపాటు ప్రస్తుతం బాపట్ల జిల్లా రేపల్లె ప్రాంతంలోని తీరప్రాంత గ్రామాల్లో దాదాపు 10 వేల మందికిపైగా మృతిచెందారు. లక్షలాది పశువులు మృత్యువాత పడ్డాయి. ఆనాటి ప్రభుత్వ అంచనాల మేరకు దాదాపు రూ.175 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఆ ఒక్కరాత్రి జరిగిన నష్టాన్ని పూడ్చి మళ్లీ ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించటానికి పదేళ్ల కంటే ఎక్కువ సమయమే పట్టింది. దివిసీమ ప్రజలు ఆ రాత్రిని కాళ రాత్రిగా చెబుతారు. తాడెత్తున ఎగసిన సముద్రపు అలలు నాగాయలంక మండలంలోని సొర్లగొంది, నాలి, దీనదయాళ పురం, సంగమేశ్వరం, గుల్లలమోద, కోడూరు మండలం పాత ఉపకాలి, హంసలదీవి, ఇరాలి, రామకృష్ణాపురం గ్రామాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే జల సమాధి అయ్యారు. కొందరు చెట్లు పట్టుకుని వేలాడుతూ ప్రాణా లు దక్కించుకున్నారు. తీరం నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరం అలలు పోటెత్తి గ్రామాలను ముంచేశాయి. సొర్లగొంది, నాలి, సంగమేశ్వరం, పాలకాయితిప్ప, హంసలదీవి, రామకృష్ణాపు రం, ఊటగుండం, ఇరాలిలో ప్రతి గ్రామంలోనూ వందల్లో ప్రాణా లు కోల్పోయారు. ఎటుచూసినా శవాల గుట్టలు.. అయిన వారిని కోల్పోయిన వారి ఆర్తనా దాలు..తినేందుకు తిండి, తాగేందుకు గుక్కెడు నీరు దొరకలేదని విపత్తు నుంచి బయటపడిన వారు చెబుతుంటారు. నాడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవటంతో మూడో రోజుకు గానీ ప్రపంచానికి తెలియలేదు. ఆపన్నులకు అండగా ఉన్నామంటూ దేశ, విదేశాల నుంచి స్వచ్ఛంద సంస్థలు, కళాశాలల విద్యార్థులు, కళారంగం నుంచి కళాకారులు తరలివచ్చారు. కుళ్లి కంపుకొడుతున్న శవాలకు దహన సంస్కారాలు నిర్వహించేందుకు శవసేన ఏర్పాటైంది. నాటి మంత్రి మండలి వెంకట కృష్ణారావు నేతృత్వంలో సహాయక పునరావాస కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రాధినేతలు, దేశాధినేతలు తరలివచ్చి పునర్నిర్మాణానికి చేయూతనందించారు. పుష్కరకాలానికి గానీ మరుభూమిగా మారిన దివిగడ్డ పునర్నిర్మా ణం పూర్తి కాలేదు. ఇప్పటికీ ఆకాశంలో చిన్న మెరుపు మెరిసినా, దూరంగా పిడుగు పడినా, సముద్రపు అల్పపీడనాలపై ఏ చిన్న హెచ్చరిక వచ్చినా దివి ప్రజల్లో తెలియని భయం, ఆందోళన.

ప్రజలు కోరుకుంటున్నది ఇదీ..

శిథిల తుఫాను షెల్టర్ల స్థానంలో తుఫాన్లు, సునామీలు తట్టు కునేలా ప్రజలతోపాటు పశువులు రక్షణ పొందేలా బహుళ ప్రయోజన షెల్టర్లు నిర్మించాలి. ఇప్పటికే ఈలచెట్లదిబ్బలో ఇలాంటి షెల్టర్‌ నిర్మించారు.

విపత్తులు సంభవించినప్పుడు తీర గ్రామాలకు అధికారులు, సహాయ బృందాలు వచ్చేందుకు రహదారులు నిర్మించాలి.

తీర గ్రామాల్లో సముద్రపు కోత నివారణకు నిపుణులతో అధ్యయనం చేయించి శాశ్వత పరిష్కారం చూపాలి.

బలహీన సముద్రపు కరకట్టలు పటిష్టపరిచి సముద్రపు నీరు డ్రెయిన్ల ద్వారా గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలి.

తీర గ్రామాల్లో రెవెన్యూ, పంచాయతీలను అనుసంధానించి వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రజలకు విపత్తులను ఎదుర్కొనేలా శిక్షణ ఇవ్వాలి. వనరుల కేంద్రాల్లో జనరేటర్లు అందుబాటులో ఉంచాలి. 2004 సునామీ అనంతరం కొన్ని గ్రామాల్లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో వనరుల కేంద్రాలు ఏర్పాటు చేశారు. పంచాయతీల అజమాయిషీ లేక అవి మూలనపడ్డాయి. రెవెన్యూ కార్యాలయాల వద్ద నిలిపి ఉంచిన పడవలు శిథిలమై ప్రభుత్వానికి లక్షల్లో నష్టం వాటిల్లింది.

విశాఖపట్నంలో మాదిరిగా గాలులలను తట్టుకునేలా గుం డ్రని విద్యుత్‌ స్తంభాలు, భూగర్భ విద్యుత్‌ లైన్స్‌ వేయాలి.

పునర్నిర్మాణానికి పన్నెండేళ్లు పట్టింది

ఉప్పెన అనంతరం దివి ప్రాంత పునర్నిర్మాణానికి దాదాపు పన్నెండేళ్లు పట్టింది. నాడు మంత్రిగా ఉన్న మండలి వెంకట కృష్ణారావు పదవిని త్యాగం చేసి పునరావాస కార్యక్రమాలు నిర్వహించారు. అవనిగడ్డ గాంధీక్షేత్రంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ఎందరినో ఆదుకున్నారు. ఆనాడు ఆయన వేసిన కరకట్టే ఇప్పుడున్న సముద్రపు కట్ట. తర్వాత మండలి బుద్దప్రసాద్‌ ఎమ్మెల్యేగా ఆ కరకట్టను పునర్నిర్మించారు. ఆనాడు విద్యార్థిగా ఉండి నాలాంటి ఎందరో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- భోగాది రమణ

మెరుగైన సాంకేతికతను వినియోగించుకోవాలి

విపత్తులు ఎదుర్కొనే సన్నద్ధంగా ఉండాలి. మెరుగైన సాంకేతికతను వినియోగించుకోవాలి. జపాన్‌, ఇండోనేషియా వంటి చోట్ల విపత్తులను ఎదుర్కొనే వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంది. అలాంటి సన్నద్ధత మనకూ అవసరం. సముద్రపు కోత, నదీ తీర గ్రామాల్లో పెరుగు తున్న నదీపాతం గురించి నిపుణుల ద్వారా అధ్యయనం జరగాల్సి ఉంది.

- బొబ్బా గోవర్ధన్‌, ఎన్‌ఆర్‌ఐ, పాత ఎడ్లంక

Updated Date - Nov 19 , 2024 | 01:39 AM